మీడియాకు హాట్ టాపిక్ గా మారిన పవన్ బహుమతి !

Seetha Sailaja
పవన్ కళ్యాణ్ కు సంబంధించిన వార్తలు వీడియోలతో మీడియా హోరెత్తి పోతోంది. సోషల్ మీడియాలో వస్తున్న ఈవీడియోలు వార్తలను చూసి పవన్ అభిమానులు ఆనందంలో తేలిపోతున్నారు. పవన్ కళ్యాణ్ కు అధికారం దక్కడంతో మెగా స్టార్ చిరంజీవి ఆనందానికి కూడ హద్దులు లేకుండా పోయింది.

పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణం చేసిన తరువాత తన సోదరుడు చిరంజీవి ఆశీర్వాదం కోసం అతడి ఇంటికి వెళ్ళినప్పుడు పవన్ వదిన శ్రీమతి సురేఖ పవన్ కళ్యాణ్ కు ఇచ్చిన ఒక విలువైన బహుమతి మీడియాకు హాట్ టాపిక్ గా మారదమే కాకుండా ఆబహుమతి విలువ గురించి అనేక కథనాలు మీడియాలో వస్తున్నాయి. పవన్ కు అతడి వదిన ఇచ్చిన ఒక విలువైన బహుమతి పెన్ అయితే ఆ పెన్ గురించి వివరాలు తెలిస్తే చాలామంది ఆశ్చర్య పోతారు.

ఆ పెన్ సుప్రసిద్ధ మౌంట్ బ్లాంక్ కంపెనీ తయారు చేసిన వాల్ట్ డిస్నీ స్పెషల్ ఎడిషన్ అని తెలుస్తోంది. దీని ఖరీదు మన ఇండియన్ కరెన్సీలో 2 లక్షల 53 వేల రూపాయలు అని అంటున్నారు. పవన్ తల్లిలా భావించే సురేఖ ఈ బహుమతిని పవన్ కళ్యాణ్ కు ఇవ్వడం వెనుక ఒక ఆశక్తికర కారణం ఉంది అంటున్నారు. మంత్రిగా పవన్ రాబోయే 5 ఏళ్ళల్లో కొన్ని వేల సంఖ్యలో ఫైల్స్ పై సంతకాలు చేయవలసి ఉంటుంది.

దీనితో పవన్ తన శాఖకు సంబంధించిన ఫైల్స్ పై సంతకం చేస్తున్నప్పుడల్లా పవన్ కు మాతృ సమానురాలైన తాను గుర్తుకు రావాలనే ఉద్దేశ్యంతో శ్రీమతి సురేఖ పవన్ కళ్యాణ్ కు ఇలాంటి విలువైన బహుమతి ఇచ్చి ఉంటుంది అని అంటున్నారు. వాస్తవానికి పవన్ కు ఈ విలువైన బహుమతి చిరంజీవి సురేఖలు ఇవ్వడం వెనుక కారణాలు తెలియనప్పటికీ సోషల్ మీడియాలో హడావిడి చేసే నెటిజన్స్ మాత్రం ఈ బహుమతికి రకరకాల అర్థాలు ఆపాదిస్తూ ఎవరి స్థాయిలో వారు ఊహాగానాలు చేస్తున్నారు..  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: