రీ స్టార్ట్ కానున్న సెల్ఫిష్... ఈసారైనా ఆశిష్ సాధిస్తాడా. ?

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ క్రేజ్ కలిగిన నిర్మాత మరియు డిస్ట్రిబ్యూటర్ అయినటువంటి దిల్ రాజు సోదరుడి కుమారుడు అయినటువంటి ఆశిష్ రెడ్డి "రౌడీ బాయ్స్" అనే మూవీతో వెండితెరకు పరిచయం అయ్యాడు . దిల్ రాజు నిర్మాణం లో రూపొందిన ఎన్నో సినిమాలు బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకున్నాయి .  అలాగే ఈయన పరిశ్రమకు పరిచయం చేసిన ఎంతో మంది హీరోలు, దర్శకులు, టెక్నీషియన్స్, నటులు ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన స్థాయి ఉన్న వ్యక్తులు గా కొనసాగుతున్నారు.

ఇలా ఈయన పరిచయం చేసిన ఎంతో మంది అద్భుతమైన స్థాయి లో ఉండడంతో ఈయన సొంత సోదరుడి కుమారుడు అయినటువంటి ఆశిష్ ను హీరోగా లాంచ్ చేస్తున్నాడు అంటే చాలా గట్టి కథతోనే ఆయనను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తాడు అని జనాలు భావించారు . కానీ సినిమా మాత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకోలేదు . దానితో ఈ మూవీ యావరేజ్ విజయాన్ని అందుకుంది. ఇక ఆ తర్వాత ఈ నటుడు సెల్ఫిష్ అనే మూవీ ని మొదలు పెట్టాడు. ఈ చిత్రం కొంత భాగం షూటింగ్ పూర్తి అయిన తర్వాత ఈ సినిమా ఆగిపోయింది.

దానితో ఈ నటుడు లవ్ మీ అనే సినిమాను స్టార్ట్ చేశాడు. ఆ మూవీ నీ కొన్ని రోజుల క్రితమే విడుదల కూడా చేశారు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా కూడా ఆశిష్ కు బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశనే మిగిల్చింది. ఇకపోతే మళ్లీ తిరిగి సెల్ఫిష్ మూవీ ని మేకర్స్ మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. మరికొన్ని రోజుల్లోనే ఈ మూవీ కొత్త షెడ్యూల్ ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం. మరి ఈ సినిమాతో ఈ యువ నటుడు ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: