జ‌గ‌న్ సైన్యం : స్పంద‌న స‌ల‌హాతో సీఎంను మెప్పించిన కింగ్‌ ధ‌నుంజ‌య్ రెడ్డి..!

RAMAKRISHNA S.S.
- స్పంద‌న రూప‌క‌ర్త ఆర్‌. ధ‌నుంజ‌య్ రెడ్డి
- న‌వ‌ర‌త్నాల స‌ల‌హాదారుగా అంకంరెడ్డి
( గుంటూరు - ఇండియా హెరాల్డ్ )
ఏపీలో వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. ఆరు మాసాల‌కు స్పంద‌న అనే కార్యక్ర‌మాన్ని అమ‌లు చేసిన విష‌యం తెలిసిందే. ప్ర‌తి సోమ‌వారం విధిగా. .. జిల్లా క‌లెక్ట‌ర్ల కార్యాల‌యాలు, మునిసిప‌ల్ కార్ప‌రే ష‌న్ కార్యాల‌యాలు... ఎస్పీ ఆఫీసులు.. కూడా..ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించాయి. ప్ర‌జ‌ల నుంచే అందే ఫిర్యాదుల‌ను కేవ‌లం 15 రోజుల్లోగా ప‌రిష్క‌రించేలా ఈ కార్య‌క్ర‌మాన్ని రూపొందించారు. ఈ మేర‌కు స‌ల‌హా ఇచ్చింది.. ఆర్‌. ధనుంజయ్‌రెడ్డి. విలేజ్‌, వార్డు సెక్రెటరీస్‌, స్పందన, సీఎంకు సలహాదారుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

పారిశ్రామిక‌రంగంలో కొంద‌రు యువ‌త‌కు శిక్ష‌ణ ఇవ్వ‌డం ద్వారా.. యువ‌త‌లో నిరుద్యోగం త‌గ్గించాల‌నే ఉద్దేశంతో స‌ల‌హాలు ఇచ్చిన వి. సునీల్‌కుమార్‌రెడ్డి ఏపీఐటీఏ స్ట్రాటజిక్‌ అడ్వైజర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అయితే.. ఈయ‌న ఇచ్చిన స‌ల‌హాలు కొన్ని మాత్ర‌మే పాటించారు. మిగిలిన‌వి బుట్ట‌దాఖ‌ల‌య్యాయి. ఇక‌, న‌వ‌ర‌త్నాల ప‌థ‌కాలు ఎలా అమ‌లు చేయాల‌ని.. ఎలా ముందుకు పోవాలి.. అనే విష‌యాల్లో ఒక క్యాలెండ‌ర్‌ను రూపొందించిన అంకంరెడ్డి నాగనారాయణ మూర్తి, నవరత్నాలు ప‌థ‌కాల స‌ల‌హాదారుగా వ్య‌వ‌హ‌రించారు.

ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని ఆది నుంచి కూడా న‌వ‌ర‌త్న ప‌థ‌కాల‌ను ఎప్పుడూ లేటు చేయ‌కుండా ల‌బ్ధిదారుల‌కు అందించ‌డంలో నారాయ‌ణ‌మూర్తి ఇచ్చిన స‌ల‌హాలు ప్ర‌భుత్వం పాటించింది. ఉన్నా లేకున్నా.. ప‌థ‌కాల‌ను మాత్రం ఆప‌లేదు. ఇక‌, చల్లా మధుసూదన్‌ రెడ్డి, స్కిల్‌ డెవల్‌పమెంట్‌ ట్రైనింగ్ స‌ల‌హాదారుగా వ్య‌వ‌హ‌రించారు. స్థానిక స్థాయిలో మ‌హిళ‌ల‌కు ఇప్పుడు చేయూత ప‌థ‌కం కింద‌.. కేవ‌లం డ‌బ్బులే కాకుండా.. ప‌లు అంశాల్లో  వారు సాధికార‌త సాధించేలా కూడా.. స‌ర్కారు శిక్ష‌ణ ఇస్తోంది.

కుట్టు ప‌నులు, అల్లిక‌లు.. మేక‌ల పెంప‌కం..తేనెటీగ‌ల పెంప‌కం వంటివి ఇప్పుడు మ‌హిళ‌ల‌కు ఆర్థికంగా భ‌రోసా ఇస్తున్నాయి. అదేవిధంగా ఎం. జ్ఞానేందర్‌రెడ్డి, పెట్టుబడుల స‌ల‌హాదారుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. రాష్ట్రానికి పారిశ్రామిక పెట్టుబ‌డులు తెచ్చేందుకు ఆయ‌న కృషి చేశారు. అయితే. కొంద‌రు వ‌చ్చినా.. కొన్ని కార‌ణాల‌తో వారు వెనుదిరిగారు. మొత్తంగా చూస్తే జ్ఞానేంద‌ర్‌రెడ్డి బాగానే కష్టించార‌ని అంటారు.. ప‌రిశీల‌కులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: