ఏపీ: మొన్న జగన్.. నిన్న చంద్రబాబు.. నేడు నాగబాబు.. ఎవరికి ఎవరు తగ్గేదెలే..?

Divya
ఆంధ్రప్రదేశ్లోని ఎన్నికల ఫలితాల పైన చాలా ఉత్కంఠత నెలకొంటోంది .ఏపీలో 25 లోక్సభ 175 అసెంబ్లీ స్థానాలకు ఈనెల 13న పోలింగ్ జరిగింది. జూన్ 4వ తేదీన ఫలితాలు వెలబడునున్నాయి. ఈ ఎన్నికలలో విజయం మీద ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రాలో మరొకసారి వైసీపీ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమాతో ఉన్నారు. అటు కూటమిలో భాగంగా అధికారం తమదే అంటూ టిడిపి పార్టీ తెలియజేస్తోంది. అయితే ఎన్నికలలో కీలకంగా మారిన జనసేన పార్టీ నుంచి 21 మంది అసెంబ్లీ స్థానాలలో పోటీ చేస్తున్నారు.

తాజాగా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు మాట్లాడుతూ తమ పార్టీ నుంచి 21 మంది ఎమ్మెల్యేలు శాసనసభలో అడుగు పెడతారంటు తమకు నమ్మకం ఉందంటూ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో జనసేన పక్షాన పోటీ చేసిన అభ్యర్థులతో నిన్నటి రోజున నాగబాబు మాట్లాడారు. అలాగే కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా  నాగబాబు మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యూహం, చంద్రబాబు నాయుడు గారి అనుభవం బిజెపి పెద్దల మద్దతు తమకు ఫలించిందని తెలియజేశారు.

అలాగే కూటమికే పట్టం ప్రజలు కట్టారని ధీమాని వ్యక్తం చేశారు జూన్ 4న తర్వాత కూటమి ప్రభుత్వంగా ఏర్పడుతుందని తెలిపారు.జనసేన నుంచి 21 మంది ఎమ్మెల్యేలు శాసనసభలు అడుగుపెట్టబోతున్నట్లుగా కూడా తెలియజేశారు. మన అధినేత పవన్ కళ్యాణ్ పదేళ్ల రాజకీయ అనుభవం తీరు ఆయన పడిన కష్టం శారీరకంగా మానసికంగా చాలా ఒత్తిడికి గురయ్యారు ఆయన కష్టం వృధా కాదని ఉద్దేశంతోనే అంత ఐక్యమత్యంగా పనిచేశారని తెలియజేశారు.ఎన్నికలలో వైసీపీకి ఏమాత్రం అనుకూలంగా లేవని కూడా తెలియజేశారు. వైసిపి పరిపాలన నుండీ ప్రజలు విముక్తి పొందుతారని పవన్ కళ్యాణ్ పూనుకోకపోతే రాష్ట్రం మళ్ళీ గాడి తప్పే పరిస్థితి ఏర్పడేది అంటే నాగబాబు వెల్లడించారు. మొన్నటి రోజున జగన్ అధికారం మాదే అని చెప్పగా చంద్రబాబు కూడా అదే దీమాని తెలియజేస్తున్నారు మరి ఈ రోజున నాగబాబు కూడా అదే దిమాని తెలియజేస్తున్నాను.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: