ప్రత్తిపాటి పుల్లారావు: చిలకలూరిపేటలో 'సైకిల్ ' పరుగులు పెట్టడం ఖాయం

FARMANULLA SHAIK
   *   భారీ మెజారిటీతో పుల్లారావు గెలవడం పక్కా
   *   నాన్ లోకల్ అభ్యర్థిని నమ్మని ప్రజలు
   *   వైసీపీ ఓటమికి మంత్రి రజిని కూడా ఒక కారణం
(చిలకలూరిపేట -ఇండియా హెరాల్డ్ ) :
ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విజయంపై అధికార, విపక్ష పార్టీలు ఎవరికి వారే తమదే గెలుపు అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.ఏపీలో గత ఎన్నికల్లో అధికార పార్టీ అయిన వైసీపీ 151 సీట్లతో రికార్డు సాధించి దేశమంతా చెప్పుకునేలా చేసింది. అయితే వైసీపీలో అంతర్గతంగా నేతల మధ్య జరుగుతున్న చర్చను బట్టి చూస్తుంటే కనీసం 120 సీట్లు గెల్చుకోవడం ఖాయమనే మాట వినిపిస్తోంది. అటు కూటమి నేతలను కదిపితే కనీసం 100-115 సీట్లు ఖాయమంటున్నారు. గాలి బాగా వీస్తే ఈ సంఖ్య 140 వరకూ వెళ్తుందని చెప్తున్నారు.అయితే కచ్చితంగా టిడిపి గెలిచే స్థానాల విషయానికి వస్తే చిలకలూరిపేట నియోజకవర్గంలో టిడిపి అభ్యర్థి మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు గెలుపు ఖాయం అనేది కచ్చితంగా తెలుస్తుంది. ఆ విషయం ముందే పసిగట్టిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎలాగో గెలిచి అవకాశం లేదు కాబట్టి వీక్ అభ్యర్థిఐనా కాబట్టి మనోహర్ నాయుడుని అక్కడ బరిలోదించడం జరిగింది.అయితే పుల్లారావు కి కలిసి వచ్చే అంశాలలో ముఖ్యంగా చెప్పుకుంటే వైసీపీ అభ్యర్థి అయినటువంటి కావటి నియోజకవర్గంలోని కొన్నిచోట్ల ప్రచారం అనేది చేయలేకపోవడం దాంతో చాలామంది ప్రజలకు వైసీపీ అభ్యర్థి అంటేనే ఎవరో తెలియకపోవడం ఆశ్చర్యాన్ని గురిచేస్తుంది.
ఇక నియోజకవర్గ విషయానికి వస్తే గత ఎన్నికల్లో జగన్ వేవ్ లో విడుదల రజిని గెలుపొందారు. అయితే గెలిచినప్పటి నుండి నియోజకవర్గాన్ని అస్సలు పట్టించుకోవడంలేదు అనేది అక్కడ ప్రజల్లో ఉన్న టాక్. రజిని తీరుపై ఆగ్రహించిన ప్రజలు ఈసారి వైసీపీకి ఓటు వేసే ఛాన్స్ లేదని డిసైడ్ అయ్యారు. ఒకవైపు మనోహర్ నాయుడు నాన్ లోకల్ అభ్యర్థి ఒకవేళ గెలిచినప్పటికీ కూడా అతను స్థానికంగా ఉండడు అనే వాదన కూడా వినబడుతుంది.ఈసారి కూడా వైసీపీకి దక్కుతాయి అన్న ఆలోచనలో వైసిపి నేతలు ఉన్నారు వైసీపీ ప్రభుత్వం మీద పూర్తిగా వ్యతిరేకంగా ఉన్న ప్రజలు కచ్చితంగా పుల్లారావును గెలిపించే దిశగానే అడుగులు వేశారని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: