తిర"క్రాస్" ఓటింగ్: కడపలో కలవరం.. క్రాస్ ఓటింగ్ ఎవరికి కలిసొచ్చిందో.?

Pandrala Sravanthi
•జగన్ ను తిరకాస్ పెట్టిన క్రాస్ ఓటింగ్
• ఒక ఓటు వైసిపి కి మరో ఓటు షర్మిలకి పడిందా..?
• అవినాష్ కి కడప లో ఓటమి తప్పదా..
 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కడప రాజకీయాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఈ జిల్లా వైయస్ ఫ్యామిలీకి కంచుకోట. వైయస్ రాజశేఖర్ రెడ్డి తాతా ముత్తాతల నుంచి ఈ జిల్లాపై ఎంతో పట్టు ఉంది.  ఆ విధంగానే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ జిల్లాని క్లీన్ స్వీప్ చేశారు.  అలాంటి కడప జిల్లాలో ఈసారి క్రాస్ ఓటింగ్ కలవరపెడుతోంది.  సీఎం సొంత జిల్లా అయినా ఇక్కడ కాంగ్రెస్ బోని కొట్టబోతోందని తెలుస్తోంది. మరి ఆ వివరాలు ఏంటో చూద్దాం. కడప పార్లమెంటు బరిలో ఈసారి వైయస్ షర్మిల కాంగ్రెస్ నుంచి బరిలో ఉండగా, పులివెందుల నుంచి అన్న జగన్మోహన్ రెడ్డి బరిలో ఉన్నారు. అంతేకాకుండా ఆయన తమ్ముడు అవినాష్ రెడ్డిని కడప పార్లమెంటు బరిలో ఉంచారు. ఈ విధంగా ఒకే ఫ్యామిలీకి చెందిన ముగ్గురు ఈ జిల్లాలో పోటీ చేస్తుండడంతో  ఫైట్ చాలా రసవత్తరంగా మారింది.  

ఇదే క్రమంలో సీఎం జగన్మోహన్ రెడ్డి తన తమ్ముడు అవినాష్ రెడ్డిని గెలిపించాలని ప్రజలను కోరగా, వైయస్ షర్మిల మాత్రం  వివేకానంద రెడ్డి హత్యకు కారణమైన అవినాష్ రెడ్డిని ఈసారి ఓడించాలని కంకణం కట్టుకుంది. అంతేకాదు రాజన్న బిడ్డగా నేను ఇక్కడికి వచ్చాను.  ఆశీర్వదించండి మీ ఇంట్లో ఆడపిల్లలా నన్ను దీవించండి అంటూ  ప్రచారం చేసింది. అంతేకాకుండా తన అన్న జగన్మోహన్ రెడ్డి మోసం చేస్తున్నాడని, వివకానంద రెడ్డిని హత్య చేయించిన వ్యక్తులను తన దగ్గర పెట్టుకున్నాడనే ఆరోపణలు చేస్తూ వచ్చింది. ఈ విధంగా సొంత జిల్లాలోనే ఒకే కుటుంబం నుంచి వచ్చిన వీరి ముగ్గురి మధ్య రసవత్తరమైన పోరు జరిగింది. ఇదే తరుణంలో జగన్ కి క్రాస్ ఓటింగ్ భయం కూడా పట్టుకుందట. కడపలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో విపరీతమైన ప్రభావం చూపింది.

 ఈ క్రమంలోనే చాలామంది ప్రజలు అసెంబ్లీకి సంబంధించి ఓటు వైసిపికి వేసి పార్లమెంటుకు సంబంధించిన ఓటు షర్మిలకు వేసినట్టు తెలుస్తోంది. ఈ విధంగా ఏడు నియోజకవర్గాల్లో పూర్తిస్థాయిలో క్రాస్ ఓటింగ్ జరిగిందని సమాచారం.  ముఖ్యంగా కడప, జమ్మలమడుగు, కమలాపురం, బద్వేల్,పొద్దుటూరు, మైదకూరులో షర్మిల కు ఓట్లు విపరీతంగా పడ్డట్టు తెలుస్తోంది. అయితే వైసిపి నుంచి పోటీ చేసే ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా ఎమ్మెల్యే ఓటు మాకు వేయండి ఎంపీ ఓటు మీకు నచ్చిన వారికి వేసుకోండి అని చెప్పారట. అంటే వారు అవినాష్ రెడ్డికి వేయమని చెప్పలేదు. ఎలాగైనా ప్రజలు షర్మిలాకు ఓటు వేస్తారని ఆ విధంగా వారు ప్రచారం చేసుకున్నట్టు తెలుస్తోంది. క్రఇదే మంలో పార్టీలకు అతీతంగా కాంగ్రెస్,టిడిపి పార్టీల అభిమానులు కూడా వైఎస్ షర్మిల వైపు మొగ్గు చూపారని తెలుస్తోంది.  ఈ క్రమంలోనే సిట్టింగ్ ఎంపీ అవినాష్ రెడ్డి ఈసారి అక్కడ బోల్తా పడడం ఖాయమని  కొంతమంది రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: