మంగళగిరిలో నారా లోకేష్ కి క్రాస్ ఓటింగ్ టెన్షన్..?

Pulgam Srinivas
తెలుగుదేశం పార్టీలో అత్యంత కీలక నేతల్లో నారా లోకేష్ ఒకరు. ఈయన పోయిన సారి అసెంబ్లీ ఎన్నికలలో మంగళగిరి స్థానం నుండి పోటీలోకి దిగారు. ఇక ఈయన టీడీపీ పార్టీలో అత్యంత కీలక నేత కావడంతో మంగళగిరి స్థానం నుండి ఈయన అవలీలగా గెలుపొందుతారు అని చాలా మంది అనుకున్నారు. కానీ ఆ అంచనాలు అన్ని తారుమారు అయ్యాయి. ఈయన పోయిన ఎలక్షన్ లలో లోకేష్ ఓటమిపాలయ్యారు. దానితో లోకేష్ తిరిగి ఈ అసెంబ్లీ నియోజకవర్గం వైపు చూడరు అని చాలా మంది అనుకున్నారు.

కానీ ఈయన మాత్రం ఇక్కడే కచ్చితంగా గెలుపొందాలి అని అనుకొని ఆఖరి ఐదు సంవత్సరాలలో కూడా ఈ నియోజక వర్గం లో చాలా పట్టు సంపాదించాడు. ఇక ఈ సారి కూడా లోకేష్ మంగళగిరి నుండి పోటీలోకి దిగారు. వైసీపీ పార్టీ నుండి మురుగుడు లావణ్య పోటీలోకి దిగింది. ఇక పోయిన సారి ఓటమిపాలైన కూడా ఇదే నియోజక వర్గం నుండి పోటీ చేయడం , ఆఖరి ఐదు సంవత్సరాలలో కూడా లోకేష్ ఈ ప్రాంత ప్రజల గురించి తెలుసుకోవడం , ఇక్కడి అవసరాలను తెలుసుకుంటూ ఉండడంతో ఈయనకు మంచి మైలేజ్ ఈ ప్రాంతంలో పెరిగింది.

అలాగే టీడీపీ పార్టీలో కీలక వ్యక్తి అయినప్పటికీ రాష్ట్రమంతా తిరిగి ప్రచారాలను చేయకుండా కేవలం మంగళగిరి లోనే ఉంటూ అక్కడే ప్రచారాలను చేస్తూ వచ్చాడు. దీనితో ఈయన మైలేజ్ మరింత పెరిగింది. ఈయన మైలేజ్ పెరగడంతో వేరే పార్టీలు కచ్చితంగా లోకేష్ ను కూడగొట్టేందుకు ఎంపీ సీట్ ఓటు ఎవరికి వేసుకున్న పర్లేదు కానీ ఎమ్మెల్యే మాత్రం మాకే వేయండి అంటూ ఈ ప్రాంత వ్యక్తులు ప్రచారం చేయడం , అలాగే లోకల్ , నాన్ లోకల్ అనే దానిని విస్తృతంగా ప్రచారం చేయడంతో క్రాస్ ఓటు జరిగి నారా లోకేష్ గెలుపు పై కొంత ఏమైనా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది అని కొంతమంది ఈ ప్రాంత ప్రజలు అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Nl

సంబంధిత వార్తలు: