ఓరి నాయనో, పవన్ కళ్యాణ్ బిడ్డలకు ఇంత ఆస్తి ఉందా..??

Suma Kallamadi
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఈసారి పవన్ గెలుస్తారని చాలామంది అంచనా వేస్తున్నారు. గెలుపు కోసం పవన్ బాగానే ట్రై చేశారు. అక్కడి ప్రజలు పవన్ కులానికి చెందిన వారే కాబట్టి ఆయనకు ఓట్లు వేసి ఉంటారని ప్రచారం జరుగుతోంది. జనసేన కార్యకర్తల నుంచి జబర్దస్త్ ఆర్టిస్టుల వరకు చాలామంది బాగానే కష్టపడ్డారు. జూన్ 4న పవన్ తో పాటు ఆయన కోసం పనిచేసిన వారి కృషి ఫలిస్తుందో లేదో తెలుస్తుంది. పవన్ ఎన్నికల సమయంలో ఓ మీడియా ఛానెల్‌తో మాట్లాడుతూ ఉంటే నా పర్సనల్ లైఫ్ కి సంబంధించి అనేక ఆసక్తికర విషయాలను బయటపెట్టారు.
రెండో భార్య రేణుదేశాయ్ గురించి కూడా ఈ ఇంటర్వ్యూలో ప్రశ్నలను అడిగారు. ముఖ్యంగా పవన్ - ఆమెకు పుట్టిన అకీరా, ఆద్యల జీవితాలు వారి భవిష్యత్తు గురించి ప్రశ్నించారు. అయితే వారిని మరి పేద వాళ్ళ లాగా కాకుండా అలాగే మరీ ఉన్న వాళ్ళ లాగా కాకుండా ఒక అర్బన్ ఏరియాలో ఉండే సగటు ఉద్యోగి లాగా పెంచానని పవన్ చెప్పుకొచ్చారు. వారి చదువులకు సంబంధించిన ఖర్చులన్నీ తాను భరించగలిగానని కూడా వెల్లడించారు. కష్టపడి సినిమాల్లో నటించి ఆస్తులు కూడా వారి పేరు మీద రాసిస్తానని తాను చెప్పినట్లు పేర్కొన్నారు. అయితే రేణు దేశాయ్ తనతో డబ్బు గురించి, ఆస్తుల గురించి ఎప్పుడూ మాట్లాడలేదని ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు.
"అకీరా-ఆద్య, నా ఎక్స్‌ వైఫ్ కోసం ఒక ఇల్లు రాసిచ్చా. మనం ఏం ఎన్ని ఆస్తులు మనవాళ్లకు ఇచ్చామని లెక్క పెట్టుకోకూడదు. అలాగని డబ్బునంతా మంచినీళ్లు లాగా ఖర్చు పెట్టకూడదు. ఎవరి ముందు చెయ్యి చాచకుండా తగినంత డబ్బును మనకోసం ఉంచుకోవాలి. మా నాన్న మా కోసం పెద్దగా డబ్బులు ఏమీ సంపాదించి పెట్టలేదు. అన్నయ్య చిరంజీవి యాక్టింగ్ స్కిల్స్ నేర్పించారు. దాని కారణంగానే ఇప్పుడు నేను సినిమాల్లో కొనసాగుతూ డబ్బులు సంపాదించగలుగుతున్నాను." కానీ పవన్ చెప్పుకొచ్చారు.
అకీరా-ఆద్యలకు వారు ఎవరిపై ఆధారపడకుండా సొంతంగా బతకగలిగేంత క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇప్పించానని హీరో అని తెలిపారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పవన్ పిల్లల కోసం ఒక ఇల్లు రాసియడమే కాకుండా, వారి ఎడ్యుకేషన్ ఖర్చులన్నీ కవర్ చేశారా అని చాలామంది ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. సెలబ్రిటీ కిడ్స్ కి ఆస్తి తక్కువే అని మరికొంతమంది కామెంట్లు పెడుతున్నారు. రేణు దేశాయ్ కూడా రిచ్ పర్సన్ కాబట్టి వారికి ఆర్థికంగా లోటు ఉండకపోవచ్చు అని మరి కొంతమంది అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: