అంత అనుభవం ఉన్నా చంద్రబాబు ఆ విషయంలో పెద్ద పొరపాటు..?

Suma Kallamadi
ఒక నాయకుడు గెలవాలంటే పోల్ మేనేజ్మెంట్ గురించి బాగా తెలిసి ఉండాలి. ఫోన్ మేనేజ్‌మెంట్‌లో కొన్ని కీలక ఘట్టాలు ఉంటాయి. అందులో మొదటిది ప్రతి ఓటర్‌ను నాయకుడు చేరుకోవడం. టీడీపీ, వైసీపీ రెండు విషయాల్లోనూ సక్సెస్ అయ్యాయి. రెండోది హామీలను స్పష్టంగా తెలియజేయడం. టీడీపీ అతిగా హామీలతో మేనిఫెస్టో ప్రజలకు అందజేసింది. ఇది ఆ పార్టీకి ఒక లాస్ లాగానే ఉంటుంది. నమ్మేలాగా మేనిఫెస్టో ఇస్తే బాగుంటుంది కానీ ఇలా చేస్తే అసలుకే ఎసరు వస్తుంది. నిజానికి జగన్ ఆల్రెడీ చాలానే సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. ఆయనకు నుంచి చంద్రబాబు కొన్ని ఎక్కువ చెప్పినా అవి అతిగానే కనిపిస్తాయి.
ఫోన్ మేనేజ్‌మెంట్‌లో అత్యంత కీలకమైనది డబ్బులు పంపిణీ చేయడం. ఇందులో వైసీపీ సక్సెస్ అయితే టీడీపీ తడబడినట్లు చెబుతున్నారు. జగన్ ప్రతి నియోజకవర్గానికి స్వయంగా రూ.30 నుంచి రూ.35 కోట్లు అందజేశారని తెలుస్తోంది. ఎస్సీ ఎస్టీ వర్గాల ప్రజలు ఎక్కువగా ఉన్నచోట రూ.35 కోట్లు జగన్ సెండ్ చేశారని టాక్. జగన్ పంపించిన డబ్బులు 100కి 90 శాతం ప్రజలకు అందిందని వినికిడి. మరోవైపు టీడీపీ ప్రతి నియోజకవర్గానికి రూ.10 కోట్ల చొప్పున పంపించింది. అసెంబ్లీ, ఎంపీ అభ్యర్థులు రూ.10, రూ.5 కోట్ల చొప్పున పెట్టుకోవాలని పిలుపునిచ్చిందట. అంటే మొత్తం మీద ఒక నియోజకవర్గంలో దాదాపు జగన్ లాగానే అమౌంటు కంచి పెట్టాలా ప్లాన్ చేశారు. అధిష్టానమే మొత్తం ఈ బరువును మోయలేదు. అభ్యర్థుల చేతిలో నుంచి డబ్బులు పెట్టేలాగా బలవంతం చేశారు.
 అయితే అభ్యర్థులలో ధనవంతులైన వారు 10 కోట్లు పెట్టగలిగారు కానీ మిగతావారు ఆ పని చేయలేకపోయారు. ఆల్రెడీ సీట్ కోసం వాళ్లు అధిష్టానానికి డబ్బులు ఇచ్చేశారు. మళ్లీ ప్రజల కోసం తమ సొంత చేతిలో నుంచే డబ్బులు ఇవ్వలేకపోయారట. ఇలా మనీ షార్టేజ్ వల్ల అన్ని చోట్ల టీడీపీ ఓటర్లకు 2000 రూపాయలు ఇవ్వలేకపోయింది. జగన్ రూ.2000 నుంచి రూ.3000 దాకా ఓటుకు డబ్బులు పంచి పెడితే, చంద్రబాబు కొన్ని చోట్ల రూ.2000 మరికొన్ని చోట్ల రూ.1500 ఇంకొన్ని చోట్ల వెయ్యి రూపాయలు తోనే సరిపెట్టారట. జగన్ ఐప్యాక్ టీం ద్వారా ఒక రూపాయి కూడా నొక్కేయకుండా డబ్బులు అన్ని ప్రజలకు చేరేలా చూసుకున్నారు. చంద్రబాబు మాత్రం నాయకులకు ఇచ్చారు. ఆ నాయకులలో కొంతమంది డబ్బు జేబులో వేసుకొని ప్రజల జేబుకు చిల్లు పెట్టారట. సాధారణంగా డబ్బులు ఇవ్వకపోతే ఏ ఓటర్ కూడా ఓటు వేయరు.డబ్బు కచ్చితంగా ఇవ్వాల్సిందే. ఇస్తే 100 ఓట్లు పడాల్సిన దగ్గర కనీసం పాతిక ఓట్లేనా పడే అవకాశం ఉంటుంది. ఆ విషయంలో చంద్రబాబు లాస్ అయినట్లు తెలుస్తోంది. ఎంతో అనుభవం ఉన్న ఈ మనీ మేనేజ్మెంట్ విషయంలో చంద్రబాబు ఫెయిల్ అయిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: