జగన్‌, బాబు: పైకి గంభీరంగానే ఉన్నా.. ఆ లెక్కలు భయపెడుతున్నాయా?

Chakravarthi Kalyan
ఏపీలో ఎవరి ధీమా వారిదే. గెలుపుపై అన్ని పార్టీలు పూర్తి విశ్వాసంగా ఉన్నాయి. పోలింగ్ శాతం పెరగడంతో ప్రభుత్వం పని అయిపోయిందని విపక్ష కూటమి భావిస్తోంది. అయితే సంక్షేమ పథకాల లబ్ధిదారులు అయిన మహిళలు, పింఛన్ లబ్ధిదారులైన వృద్ధులు పెద్ద ఎత్తున ఓటు వేసేందుకు ఆసక్తి చూపడంతో తమదే గెలుపు అనే ధీమా వైసీపీలో కనిపిస్తోంది.

రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 81.66 శాతం ఓటింగ్ నమోదు అయింది. పోలింగ్ వరకు నువ్వానేనా అన్నట్లు సమరం సాగింది. అందుకు తగ్గట్లు గానే ఓటింగ్ సైతం జరిగింది. ఇతర ప్రాంతాల నుంచి పెద్ద  సంఖ్యలో ఓటర్లు తరలి రావడంతో ఓటమికి అనుకూలమనే ప్రచారం ప్రారంభమైంది. దీంతో జగన్ సైతం అలెర్ట్ అయ్యారు. విజయంపై ధీమా వ్యక్తం చేస్తూ ఓటింగ్ సరళిపై సమీక్షించారు.

ప్రభుత్వంపై వ్యతిరేకత, పెరిగిన పోలింగ్ అంశాలు తమకే అనుకూలిస్తాయని కూటమి లెక్కలు కడుతోంది. భారీ మెజార్టీ ఖాయమని అంచనా వేసింది. అయితే ఉదయానికే మహిళలు, వృద్ధులు ఓటు వేసేందుకు బారులు తీరడంతో వైసీపీలో ఆశలు మరింత పెరిగాయి. గత ఎన్నికల సమయంలో ప్రభుత్వ వ్యతిరేకతను ఓటింగ్ శాతం రూపంలో ఏపీ ప్రజలు తీర్పునిచ్చారు. ఈ సారి కూడా ఇదే రిపీట్ అవుతుందని కూటమి నేతలు పేర్కొంటున్నారు.

అయితే ఇరు పార్టీలు గెలుపుపై పూర్తి నమ్మకంతో ఉన్నా ఏ ఫ్యాక్టర్ జనాలను ప్రభావితం చేసిందో ఎన్నికల ఫలితాల రోజే తెలుస్తోంది. టీడీపీ ఏమో మీ భూములు మీకు కావాలంటే అంటే కూటమి నేతలకు ఓటు వేయండి అంటూ ప్రజల్లో ఓ భయాన్ని సృష్టించింది. ఇక వైసీపీ చంద్రబాబు అధికారంలోకి వస్తే ప్రస్తుతం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఆగిపోతాయని భయపెట్టించారు.  మొత్తం మీద ఇరు పార్టీలు సంక్షేమ పథకాలతో పాటు భయాన్ని కూడా క్రియేట్ చేశారు. మరి ఈ పెరిగిన ఓట్లు తమకే అనుకూలం అని ఇరు పార్టీలు ప్రకటించుకోవడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: