ఏపీలో గెలిచేదెవరో.. పోలీసులు తేల్చి చెప్పేశారా?

Chakravarthi Kalyan
అసెంబ్లీ ఎన్నికల్లో భారీ పోలింగ్ పై టీడీపీ లో సంతృప్తి వ్యక్తం అవుతోంది. ప్రజల్లో జగన ప్రభుత్వంపై నెలకొన్న తీవ్ర వ్యతిరేకత ఓటింగ్ లో ప్రతిఫలించిందని, అందుకే ఓట్ల సునామీ వచ్చిందని ఆ పార్టీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఎన్నికల కమిషన్ సైతం 81 శాతం పోలింగ్ నమోదు అయిందని చెప్పడంతో కూటమి నేతల్లో ఆనందం కనిపిస్తోంది.

ఎందుకంటే గత ఎన్నికల సమయంలో అప్పటి టీడీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత బలంగా ఉండటం వల్లే పోలింగ్ ఎక్కువగా జరిగిందని అప్పట్లో విశ్లేషణలు వెలువడ్డాయి. ఆ లెక్కన చూసుకుంటే ఇప్పుడు కూడా దానికి మించి పోలింగ్ నమోదు అయిందంటే.. ప్రభుత్వంపై వ్యతిరేకతే కారణమని ఆ పార్టీ నాయకులు అంచనా వేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఇప్పుడు పోలీసుల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు విజయం సాధిస్తారు అనే పార్టీలపై తోపాటు అధికారం వైపు నిలబడతారు. వాళ్లకి పోలింగ్ సరళిపై ఓ అవగాహన ఉంటుంది.

ఇంకా చెప్పాలంటే ఓటింగ్ సరళిని కూడా ప్రభావితం చేయగలరు. తమకు అనుకూలంగా ఉండే పార్టీని ప్రభుత్వంలో కూర్చోబెట్టేందుకు యత్నిస్తారు. పోలింగ్ బూత్ ల దగ్గర ఉంటారు కాబట్టి.. వీరి వంతు కృషి చేస్తుంటారు. ప్రస్తుతం అటు పోలీసులలో, ఇటు ప్రభుత్వ ఉద్యోగుల్లో జగన్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉంది. కారణం ఒకటో తారీఖున జీతాలు పడకపోవడంతో పాటు చేస్తానన్న సీపీఎస్ విధానాన్ని రద్దు అమలు చేయకపోవడం.

మరోవైపు బదిలీలు, ఫిట్ మెంట్లు ఇలా ఉద్యోగులు కోరుకున్న అంశాలను వైసీపీ ప్రభుత్వం పక్కన పెట్టింది. దీంతో వీరంతా ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పుడు చూస్తే పోలింగ్ రోజు నుంచి ఇప్పటి వరకు జరిగిన దాడుల్లో పోలీసులు టీడీపీ నేతలకు సహకరిస్తున్నారని వైసీపీ కీలక నేతలైన సజ్జల రామకృష్ణారెడ్డి, అంబటి రాంబాబు, అనీల్ కుమార్ యాదవ్ లు ఆరోపిస్తున్నారు. పైగా స్థానిక ఎమ్మెల్యేలు చెబుతున్నా పోలీసులు లెక్క చేయడం లేదన్న వాదలను వినిపిస్తున్నాయి. అంటే ప్రభుత్వం పడిపోతుందనే సంకేతాలు వీరికి స్పష్టంగా తెలిశాయా… అందుకే ఇలా ప్రవర్తిస్తున్నారా అని వైసీపీ శ్రేణుల్లో టెన్షన్ మొదలైంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: