మూడ్ ఆఫ్ ఏపీ : ప్ర‌శాంత్ కిషోర్ గుట్టు ర‌ట్టు చేసిన జ‌గ‌న్‌... ప‌రువు మొత్తం పాయే..?

Divya
గత ఎన్నికలతో పోల్చుకుంటే ఈసారి ఎన్నికలు మరింత రసవత్తరంగా సాగిన విషయం తెలిసిందే.. ఇదిలా ఉండగా మే 13వ తేదీన ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికలు ముగిసిన అనంతరం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి తాజాగా ఐ ప్యాక్ ఆఫీసులో ప్రసంగించారు. అందులో భాగంగానే ప్రశాంత్ కిషోర్ గుట్టు రట్టు చేస్తూ ఆయన చేసిన కామెంట్లకి ప్రశాంత్ కిషోర్ పరువు మొత్తం పోయిందనే చెప్పాలి. 2019లో వచ్చిన సీట్ల కంటే ఈసారి అత్యధికంగా సీట్లు సాధించబోతున్నామని జగన్ విశ్వాసం వ్యక్తం చేశారు.. ముఖ్యంగా ఐ ప్యాక్ ఆఫీసులో పార్టీ కోసం పని చేసిన వారిని ఉద్దేశించి మాట్లాడారు..

జూన్ 4వ తేదీన ఆలోచించలేనన్ని సీట్లు రాబోతున్నాయని జోస్యం చెప్పారు. తాజాగా విజయవాడలోని ఐ ప్యాక్ ఆఫీస్ కి వెళ్లిన జగన్ వచ్చే ప్రభుత్వంలో ఈ ఐదేళ్ల కంటే ఎక్కువగా ప్రజలకు మేలు చేస్తామని స్పష్టం చేశారు.. జూన్ 4న వచ్చే ఫలితాలు చూసి దేశం షాక్ అవ్వబోతుందని .. 22 ఎంపీ సీట్లు గెలవబోతున్నామని ప్రశాంత్ కిషోర్ ఆలోచన లో లేనన్ని సీట్లు రాబోతున్నాయని జోష్యం తెలిపారు. ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ. వైసిపి కోసం స్ట్రాటజిస్ట్ గా పనిచేసింది.. ప్రశాంత్ కిషోర్ ఐ ప్యాక్ లో ఉన్నప్పుడు ఒప్పందం కుదుర్చుకున్నారు. 2014 ఎన్నికల్లో పరాజయం పాలైన తర్వాత పీకేతో ఒప్పందం చేసుకున్నారు.. 2019 ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ అంతా తానై వ్యవహరించారు.. కానీ ఆ తర్వాత ఐ ప్యాక్ తరఫున తమిళనాడు , బెంగాల్లో డిఎంకె టీఎంసీలకు పనిచేశారు ..అక్కడ కూడా ఆయన పనిచేసిన పార్టీలకు విజయాలు సాధించిపెట్టారు. ఆ తర్వాత ఐ ప్యాక్ నుంచి బయటకు వచ్చేసారు. ఇక సొంత సంస్థను పెట్టుకొని బీహార్లో పాదయాత్ర చేశారు.. కానీ ఆ సంస్థను రాజకీయ పార్టీగా తీర్చిదిద్దలేక పోయారు అందుకే ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు..

అయితే ప్రస్తుతం  చాలా మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇవ్వగా.. అందులో వైసిపి ప్రభుత్వం గురించి మాట్లాడుతూ.. ఏపీలో వైసిపి చాలా భారీగా ఓడిపోతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.. ఇలా చెప్పడంపై వైసీపీ అధినేత ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రశాంత్ కిషోర్ ఊహించలేనన్ని సీట్లు వస్తాయని చెప్పుకొచ్చారు..  మొత్తానికైతే ఒక్క మాటతో ప్రశాంత్ కిషోర్ కి చెక్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: