మూడ్ ఆఫ్ ఏపీ : జ‌గ‌న్ 151 డైలాగ్‌కు ప‌వ‌న్‌, బాబు, బీజేపీ ద‌గ్గ‌ర కౌంట‌రే లేదా ?

Reddy P Rajasekhar
రాజకీయాలలో కొందరు నేతల మాటలకు మాత్రమే విశ్వసనీయత ఉంటుంది. తాము మంచి చేశామని ప్రజలు నమ్మితే మాత్రమే ఓటు వేయండని అడిగే దమ్ము, ధైర్యం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలా చెప్పగలిగే దమ్ము, ధైర్యం, సత్తా ఉన్న ఏకైక నేత జగన్ మాత్రమేనని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. అలాంటి జగన్ ఎన్నికలు పూర్తైన తర్వాత 151 అసెంబ్లీ స్థానాలను మించి వైసీపీ విజయం సాధిస్తుందని తేల్చి చెప్పారు.
 
జగన్ పూర్తిస్థాయి కాన్ఫిడెన్స్ తో వైసీపీ మరోసారి అధికారంలోకి వస్తుందని కామెంట్లు చేసి దాదాపుగా మూడు గంటలు అవుతున్నా ప‌వ‌న్‌, బాబు, బీజేపీ ద‌గ్గ‌ర నుంచి ఈ కామెంట్లకు కౌంటర్ లేదు. ఒకే ఒక్క డైలాగ్ తో జగన్ ప్రతిపక్ష నేతల గుండెల్లో గుబులు పుట్టించారని టీడీపీ, జనసేన రాష్ట్రంలో మరో 5 సంవత్సరాలు ప్రతిపక్షానికే పరిమితం కానుందని తేల్చి చెప్పారని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
 
ఎన్నికలు పూర్తైన తర్వాత టఫ్ ఫైట్ ఉంటుందని కూటమికే ఎడ్జ్ ఉండవచ్చని వచ్చిన కొన్ని వార్తలు వైసీపీ ఫ్యాన్స్ ను ఒకింత కంగారు పెట్టిన మాట వాస్తవం. అయితే వైసీపీ అభిమానుల్లో నెలకొన్న సందేహాలను, అనుమానాలను జగన్ ఒక్క డైలాగ్ తో పటాపంచలు చేసేశారు. అంచనాలను మించి ఫలితాలను సాధించబోతున్నామనే నమ్మకాన్ని క్యాడర్ లో కలిగించడంలో జగన్ నూటికి నూరు శాతం సక్సెస్ అయ్యారు.
 
జూన్ నెల 4వ తేదీన వెలువడే ఎన్నికల ఫలితాలలో సైతం జగన్ మాటలే నిజమని ప్రూవ్ అయితే మాత్రం కూటమి నేతల పరువు పోవడం ఖాయమని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది. కొత్త హామీలను ప్రకటించకుండానే పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకొస్తే భవిష్యత్తు ఎన్నికల్లో సైతం జగన్ కు తిరుగుండదని ఆయన అమలు చేసిన మంచి పథకాలే ఓట్ల రూపంలో జగన్ ను మళ్లీ గెలిపించడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. జగన్ కామెంట్లతో కూటమి నేతలు గజగజా వణకాల్సిన పరిస్థితి అయితే ఉందని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: