పెళ్లి చేసుకొని ఎవడు బాగుపడ్డాడు అంటూ అలీపై రివర్స్ అయిన కోవై సరళ..?

Suma Kallamadi
తెలుగు సినిమా ఇండస్ట్రీలో మేల్ కమెడియన్లకు కొదవలేదు కానీ ఫిమేల్ కమెడియన్లు చాలా తక్కువ ఉన్నారని చెప్పవచ్చు. టాలీవుడ్‌లో అడుగుపెట్టిన ఫిమేల్ కమెడియన్లు బ్రహ్మానందం రేంజ్ లో నవ్వించిన దాఖలాలు లేవు ఒక్కరు మినహాయించి! ఆ ఒక్కరు మరెవరో కాదు "ముప్పి డెబ్బి" అంటూ పొట్ట చెక్కలయ్యేలా నవ్వించిన నటి కోవై సరళ. బ్రహ్మానందంతో కలిసి ఈమె చేసిన అన్ని కామెడీ ట్రాకులు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఇప్పటికీ వీరి కామెడీ చూసి తెలుగు ప్రేక్షకులు కడుపుబ్బ నవ్వుకుంటూ రిలాక్స్ అవుతారంటే అతిశయోక్తి కాదు.
కోవై సరళ తమిళనాడుకు చెందిన నటి, కానీ తెలుగులో కూడా నటిస్తూ మనకి దగ్గరయ్యారు. తాజాగా ఆమె కమెడియన్ అలీ హోస్ట్ చేస్తున్న ఒక షోకు వచ్చి తన గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. కోయంబత్తూర్‌లో తాను పుట్టి పెరిగానని, చిన్నతనం నుంచే ఎంజీఆర్‌ అంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది. ఆయన సినిమాలు చూసిన తర్వాతే తనకి యాక్టింగ్ పట్ల మక్కువ పెరిగినట్లు వెల్లడించింది. తెలుగులో మీకు ఇష్టమైన కమెడియన్స్ ఎవరు అని అడిగితే బ్రహ్మానందం అనే టక్కున చెప్పేసింది ఆ తర్వాత అలీ అని అతని పేరు కూడా చెప్పింది. బ్రహ్మానందం తాను కలిసి నటించి ఉంటామని, ఆయనతో నటించిన వారిని మంచి హిట్ అయ్యాయని తెలిపింది.
తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషా సినిమాల్లో నటించానని పేర్కొంది. మొత్తం కలిపితే తాను 900 సినిమాలలో యాక్ట్ చేశానని చెప్పి ఆశ్చర్యపరిచింది. అంటే ఇంకా 100 సినిమాలంటే ఇస్తే బ్రహ్మానందం లాగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లోకి ఈమె ఎక్కి ఉండేది. అయితే చాలామంది సినిమాల కోసమే కోవై సరళ అలా ఫన్నీగా మాట్లాడుతుందా ఫన్నీ బాడీ లాంగ్వేజ్ ప్రదర్శిస్తుందని చాలామంది అనుకుంటారు ఇదే విషయం గురించి ఆమెను అడిగినప్పుడు.. "సినిమాల్లో చూసేదే నా ఒరిజినల్ వాయిస్, నా బాడీ లాంగ్వేజ్. యాక్టింగ్ కోసం నేను వీటిని ప్రత్యేకంగా డెవలప్ చేసుకోలేదు. నన్ను అంతా ఎలా చూస్తున్నారో నిజజీవితంలో కూడా సేమ్ అలాగే ఉంటాను" అని కోవై సరళ తెలిపింది.
అయితే అవి కొంచెం సున్నితమైన ప్రశ్న అడిగాడు. "మీరు ఇంతవరకు ఎందుకు పెళ్లి చేసుకోవట్లేదు? పెళ్లి చేసుకోపోతే మిమల్ని ఎవరు చూసుకుంటారు?" అంటూ ప్రశ్నించాడు ఈ ప్రశ్న వినగానే ఆమె కాస్త కోపంగా మాట్లాడింది. అతడిపై రివర్స్ అవుతూ.. "ఇక్కడ ఎవరూ ఎవరినీ చూస్తారనే గ్యారెంటీ ఉండదు. కొడుకు పుట్టినా, కూతురు పుట్టినా వారు విదేశాలకు వెళ్లిపోయి సెటిల్ అయిపోతారు. భర్త చనిపోతే భార్య ఒంటరి అయిపోతుంది. ఒంటరిగానే జీవితాన్ని ముందుకు సాగిస్తుంది. ఎవరో మనల్ని చూస్తారని ఆశించకూడదు. దేనికి భయపడకూడదు. నన్ను చూడటానికి ఎవరో రావాలని నేను ఎప్పుడూ కోరుకోను. నాకు నేనై అన్నీ, నాపై నాకున్న నమ్మకంతోనే జీవితాన్ని గడిపేస్తా. ఇతరులకు ఆపన్న హస్తాన్ని కూడా అందిస్తా. రేపటి సంగతి రేపు ఆలోచన చేద్దాం" అని స్పష్టం చేసింది. దాంతో అలీ గతుక్కుమన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: