ఉత్త‌రాంధ్ర పోలింగ్.. ఫ్యాన్ గాలి ఊపేస్తోందిగా...!

Purushottham Vinay
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ నేడు ప్రారంభం అయ్యింది. మే 13వ తేదీ ఈరోజు ఉదయం 7 గంటలకు ఓటింగ్ అనేది మొదలవ్వగా..వేల సంఖ్యలో ఆంధ్రా ఓటర్లు పోలింగ్ బూత్ లకు తరలివచ్చారు. కొన్ని పోలింగ్ బూతుల్లో అయితే ఓటర్ల జాతర కనిపించిందనే చెప్పాలి. పోలింగ్ బూతుల దగ్గర తిరనాళ్ల సందడి అనేది ఒక రేంజ్ లో నెలకొందనే చెప్పాలి. పోలింగ్ దగ్గర ఎన్నో వందల మంది క్యూలో కనిపించారు. ఇంకో ముఖ్యమైన అంశం ఏంటంటే.. పోలింగ్ బూతుల దగ్గర పురుషులు కంటే మహిళలు పెద్ద సంఖ్యలో కనిపించటం విశేషం అని చెప్పాలి.అసలు గతంలో మునుపు ఎప్పుడూ లేని విధంగా ఉదయమే పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు వేల సంఖ్యలో ఒకేసారి తరలిరావటంతో పెద్ద పెద్ద క్యూలు కనిపిస్తున్నాయి. జన జాతరా.. ఓటర్ల జాతరా అన్నట్లు పోలింగ్ బూతుల దగ్గర సందడి నెలకొంది. రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో ఇలాంటి ఓటర్ల వాతావరణ పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని మహిళా ఓటర్లు ఉదయం పూట ఏడు గంటల నుంచే పోలింగ్ కేంద్రాలకు రావటం కనిపించింది. ఆంధ్రప్రదేశ్ లోని పట్టణాలు, అర్బన్ ఏరియాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లోని ఓటర్లు ఎంతో ఉత్సాహంగా తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.

ముఖ్యంగా ఉత్తరాంధ్ర లో అయితే ఓటర్ల సందడి మాములుగా లేదు. చాలా హోరా హోరీగా పోలింగ్ అనేది జరుగుతుంది. ముఖ్యంగా వైసీపీకి ఎక్కువ ఓట్లు పోల్ అవుతున్నాయని అక్కడ ఓట్లు వేస్తున్న జనాల నుంచి ఇండియా హెరాల్డ్ ప్రతినిధులకు సమాచారం తెలుస్తుంది. ఉత్తరాంధ్రలో ఫ్యాన్ గాలి బాగా వీస్తున్నట్లు సమాచారం తెలుస్తుంది. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి వంటి ఏరియాల్లో జనాలు టీడీపీ కూటమి కంటే వైసీపీ వైపే మొగ్గు చూపుతూ ఓట్లు వేస్తున్నట్టు సమాచారం తెలుస్తుంది.ఈసారి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ సీట్లలో కేవలం శ్రీకాకుళంలో మాత్రమే టీడీపీకి గెలుపు అవకాశాలు ఉన్నాయి. మిగిలిన చోట్ల అంతగా లేవు. కనీసం ఎంపీ సీట్లలో కూడా గెలవడం టీడీపీకి కష్టంగా ఉంది. అందుకే విజయనగరం, విశాఖలో టీడీపీ కంటే వైసీపీకే ఎక్కువ ఓట్లు పోల్ అవుతున్నట్లు సమాచారం తెలుస్తుంది. జగన్ మోహన్ రెడ్డి ఇంకా ఆయన పార్టీ నేతల వాగ్దానాలు ఇంకా గతంలో జనాలకు చేసిన మంచి పనుల వల్ల వైసీపీకి ఉత్తరాంధ్రాలో జనాలు బ్రహ్మరథం పడుతూ ఓట్లు వేస్తున్నారు. ఈ ఓట్లతో ఉత్తరాంధ్రాలో ఖచ్చితంగా వైసీపీ భారీ మెజారిటీతో గెలవడం పక్కా అని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: