బ‌న్నీ, జూనియ‌ర్ ఎన్టీఆర్ ఇద్ద‌రూ జ‌గ‌న్ వైపే... క్లారిటీ ఇచ్చేశారుగా...!

Suma Kallamadi
ఏపీ ఎన్నికల ప్రచారం చివరి రోజు చాలా ట్విస్టులతో గడిచింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆంధ్రప్రదేశ్ కి వచ్చి ప్రచారాలు చేపట్టారు. అయితే మెగా ఫ్యామిలీకి చెందిన బన్నీ పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మద్దతుగా ప్రచారం చేయలేదు. పవన్‌కి ప్రత్యర్థి పార్టీ అయిన వైసీపీ అభ్యర్థికి బహిరంగంగా తన మద్దతును ప్రకటించాడు.తన స్నేహితుడు, వైసీపీ ఎమ్మెల్యే అయిన శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి కోసం బన్నీ ఎన్నికల ప్రచారం చేశాడు. శనివారం సతీసమేతంగా నంద్యాల వెళ్లి వైసీపీ అభ్యర్థి చేయి పట్టుకుని మరీ మద్దతు ప్రకటించారు. దీనివల్ల ఒక విషయం మాత్రం స్పష్టంగా అర్థం అయింది. అదేంటంటే బన్నీ జగన్ వైపే ఉన్నాడు. పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ కి చాలా దగ్గరి చుట్టమవుతాడు. పవన్ కళ్యాణ్ గెలుపు కోసం చిరంజీవి, రామ్ చరణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్, ఇంకా చాలామంది సినీ ప్రముఖులు ప్రచారాలు చేస్తున్నారు తమ వంతు ఏదో ఒక విధంగా ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. జగన్ కి వ్యతిరేకంగా కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు.
ఇలాంటి సమయంలో అల్లు అర్జున్ కూడా పవన్ వైపే మాట్లాడాలి. ఆయన గెలిపించాలని అడగాలి. అలా కాదని ప్రత్యర్థి పార్టీ అభ్యర్థికి నేను మద్దతు ఇస్తానంటే అది స్పష్టమైన సంకేతం పంపుతుంది. బన్నీ చేసిన పని వల్ల ఇప్పుడు ఆయన జగన్ వైపే ఉన్నారని, జగన్ పార్టీని గెలవాలని కోరుకుంటున్నారని స్పష్టంగా అర్థం అవుతుంది. స్నేహితుడు ఏ పార్టీలో ఉన్నా సపోర్ట్ చేస్తానని అన్నాడు కానీ స్వయంగా నంద్యాల వెళ్లి సతీసమేతంగా ప్రచారం చేయడం చూస్తుంటే జగన్ అంటేనే బన్నీకి ఇష్టమని తెలుస్తోంది. పవన్ కోసం ఒక చిన్న ట్వీట్ చేసినట్లు ఫ్రెండ్ కోసం కూడా ఒక ట్వీట్ చేసి ఉంటే అది మరోలా ఉండేది.
ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా జగన్ వైపు ఉన్నట్లే అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే నందమూరి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఏపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాల్లో పాల్గొన్నారు. నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి, యశస్విని, నందమూరి సుహాసిని లాంటి వారందరూ ప్రజల్లో తిరుగుతూ టీడీపీ కూటమికి ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే వీళ్ళకంటే ఎన్టీఆర్ కి ప్రజల్లో మంచి పాపులారిటీ ఉంది. ఆయన తలుచుకుంటే లక్షల మంది ఓటర్లను టీడీపీ వైపు తిప్పగలడు. కానీ తారక్‌ టీడీపీకి సపోర్టుగా చిన్న మెసేజ్ కూడా చేయలేదు. దీన్ని బట్టి తారక్ కూడా జగనే గెలవాలని కోరుకుంటున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: