ఏపీ: ఆంధ్ర నాయకులు సంస్కార హీనులా.. ముఖ్యంగా చంద్రబాబు..??

Suma Kallamadi
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల టీవీ9కి మాజీ సీఎం కేసీఆర్, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరూ వచ్చి ఇంటర్వ్యూలు ఇచ్చారు. బీజేపీ కీలక నేతలు కూడా టీవీ9కి వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చారు. కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం అలా జరగలేదు. జగన్ టీవీ9కి ఇంటర్వ్యూ ఇచ్చారని ఆ ఛానెల్‌ను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బహిష్కరించారు. ఆ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇవ్వకుండా తనకు అనుకూలంగా ఉన్న ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి ఇంటర్వ్యూ ఇచ్చారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా రేపు టీవీ9కి కాకుండా ఎల్లో బ్యాచ్ మీడియాలలో ఏదో ఒక ఛానెల్ కి ఇంటర్వ్యూ ఇచ్చే అవకాశం ఉంది.
సీఎం జగన్మోహన్ రెడ్డి తన సొంత ఛానెల్ సాక్షికి ఇంటర్వ్యూ ఇవ్వాలనుకుంటే ఇవ్వవచ్చు కానీ అలా చేయలేదు ఒక న్యూట్రల్ మీడియా వద్దకే వెళ్లి ఆయన తన అభిప్రాయాలను పంచుకున్నారు. న్యూట్రల్ మీడియా ద్వారా ఇంటర్వ్యూ ఇస్తే చంద్రబాబు నాయుడుకి పేరు వచ్చేది కానీ ఆయన తన అనుకూల మీడియా ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చే టీవీ9 డాన్స్ చేయడం ఆయన సంస్కార హీనత్వానికి నిదర్శనం అని చెప్పుకోవచ్చు.
ఒక న్యూట్రల్ ఛానల్ ను బాయికాట్ చేద్దాం అనడం, బహిష్కరించామని చెప్పడంలో లాజిక్ ఏంటో అర్థం కావడం లేదు. టీవీ9 ఏ పార్టీ తరఫున కూడా అనుకూలంగా ఉండదు. అలాంటప్పుడు దానిని వ్యతిరేకించడం చంద్రబాబుకి న్యాయమా అని చాలామంది ప్రశ్నిస్తున్నారు. ఇక చంద్రబాబు నాయుడు ఇంటర్వ్యూకి వ్యూయర్‌షిప్ చాలా తక్కువగా వచ్చింది. జగన్మోహన్ రెడ్డి టీవీ9 ఇంటర్వ్యూకి మాత్రం రికార్డ్ స్థాయిలో వ్యూయర్‌షిప్ లభించింది. అంటే ఈ టీడీపీ అధినేత తనకి అనుకూలంగా ఉండాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా జనాలను మాత్రం ఆకర్షించలేకపోతున్నాడు. ఈ ఇంటర్వ్యూ కారణంగా చంద్రబాబుకి నష్టమే తప్ప ఎలాంటి ప్రయోజనం చేయకూడదు. జగన్ చాలా విషయాలపై క్లారిటీ ఇచ్చి మరింత మంది జనాలను ఆకట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: