ఆ డైలాగ్‌లతో.. నవ్వుల పాలవుతున్న మోదీ..?

Chakravarthi Kalyan
ప్రధాని మోదీ ఏ రాష్ట్రానికి ఎన్నికల ప్రచారానికి వెళ్లినా.. అక్కడ కుటుంబ పాలన, అవినీతి గురించి మాట్లాడుతూ ఉంటారు. ఈ రెండు అంశాలతోనే ఎక్కువగా ప్రజల్లోకి వెళ్లి ప్రత్యర్థులను ఇరుకున పెడుతుంటారు.  2014లో మోదీ అధికారంలోకి రావడానికి దోహదం చేసిన అంశాలు కూడా ఇవే. నాటి యూపీఏ ప్రభుత్వం 2 జీ స్పెక్ట్రం, బొగ్గు కుంభకోనం, ఒలంపిక్స్ ఇలా పలు రకాల ఆరోపణలు చేసి అధికారంలోకి వచ్చారు.

నల్లధనం వెనక్కి తీసుకువచ్చి ఒక్కొక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తా అని ప్రకటించడంతో ప్రజలంతా నమ్మి ఓటేశారు.  ఆ నల్లధనం రాలేదు.  అవినీతి ఆరోపణలు కేసులు ముందుకు సాగలేదు.  అయినా ఇప్పటికే ఇవే అంశాలు పట్టుకొని మోదీ రాజకీయం చేస్తారు. అయితే రాష్ట్రాలు, తన మిత్రుల బట్టి ప్రాధాన్య అంశాలు మారుతూ ఉంటాయి.

వారసత్వ పాలన గురించి ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో మోదీ మాట్లాడారు. ఎందుకంటే ఆయా రాష్ట్రాల్లో కుటుంబ పార్టీలతోనే బీజేపీ పొత్తు పెట్టుకుంది కాబట్టి. ఇదే సమయంలో అవినీతి కేసుల గురించి కూడా తమతో ఉంటే ఒకలా లేకుంటే మరోలా విమర్శిస్తుంటారు.  2019కి ముందు పోలవరం చంద్రబాబుకి ఏటీఎంలా మారిందని.. అలాగే లోకేశ్ ని సీఎం చేసేందుకు తపిస్తున్నారు అంటూ విమర్శించారు. ఇప్పుడు ఆ పార్టీతోనే పొత్తు పెట్టుకున్నారు.

కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు జేడీఎస్ అవినీతి పార్టీ, కుటుంబ పార్టీ అని విమర్శించిన మోదీ.. ఇప్పుడు వారిని తమతో కలుపుకొన్నారు. మహారాష్ట్రలో అజిత్ పవార్ రూ.70వేల కోట్ల కుంభకోణం చేశారని ఆరోపించారు. ఇప్పుడు ఎన్డీయేలో చేరగానే ఆయనకు క్లీన్ చిట్ లభించింది. అశోక్ చవాన్ పరిస్థితి కూడా అంతే. నితీశ్ కుమార్ బీజేపీతో ఉంటే అపర దేశ భక్తుడు. లేకపోతే నితీశ్ గెలిస్తే పాకిస్థాన్లో సంబురాలు చేసుకుంటారు అని మాట్లాడుతుంటారు. ఇంకా సువేందు అధికారి, జ్యోతి రాధిస్య సింధియా ఇలా చాలా మంది తమ పార్టీలోకి వస్తే అవినీతి పరులు కాదు. లేకపోతే దేశద్రోహులు. వారసత్వ రాజకీయ నాయకులు. ఈ ఘటనలు చూసి నరేంద్ర మోదీ అవినీతిపై ఆరోపణలు చేస్తే ప్రజలు నవ్వుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: