ఏపీ : కాయ్ రాజా కాయ్.. బెట్టింగ్ లో కూడా ఆ పార్టీదే హవా..?

FARMANULLA SHAIK
ఆంధ్రప్రదేశ్లో రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు సర్వం సిద్ధం చేశారు. ప్రధాన పార్టీల ఎన్నికల ప్రచారాలు నిన్నటితో ముగిసాయి. పార్టీ నేతలు తమ తమ గెలుపు కోసం డబ్బు, మద్యం  పంపిణీలు ఇప్పటికే ప్రారంభించాయి. ఇది ఇలా ఉంటే ఇంకోవైపు ఏపీ సీఎం ఎవరు అనేదాని మీద బెట్టింగ్ రాయుళ్లు లక్షలు ఖర్చు పెడుతున్నారు.చట్ట ప్రకారం బెట్టింగ్ అనేది నిషేధం. క్రికెట్ లాంటి ఆటకు సంబంధించి బెట్టింగ్లను పోలీసులు అరికడుతుంటారు కానీ ఇప్పటివరకు పొలిటికల్గా బెట్టింగ్ పై పోలీసుల ఇన్వాల్వ్మెంట్ అనేది లేదు.అందుకనే బెట్టింగ్ రాయుళ్ళు దూసుకుపోతున్నారు.అయితే పార్టీ అభ్యర్థి పై లోకల్గా మరియు సీఎం ఎవరు అనేదాని మీద 10లక్షల నుండి 10కోట్ల వరకు బెట్టింగ్ జరుగుతుందని ఒక అంచనా.బెట్టింగ్ విషయంలో ఉభయ గోదావరి జిల్లాలకు పెట్టింది పేరు. అక్కడ కోట్లాది రూపాయలు బెట్టింగ్ జరుగుతుంది.అక్కడ ఏ పార్టీ ఎక్కువ సీట్లు సాధిస్తే ఆ పార్టీ అభ్యర్థి సీఎం అవుతాడనే ప్రచారం కూడా ఉంది.మరీ ముఖ్యంగా బెట్టింగ్ అనేది సీఎం ఎవరు? పవన్ కళ్యాణ్ పిఠాపురం నుండి గెలుస్తారా? లేదా? గెలిస్తే ఎన్ని ఓట్ల మెజారిటీతో గెలుస్తారు. అలాగే చంద్రబాబు పరిస్థితి ఏంటి..? గెలిస్తారా? లేరా? మెజారిటీ ఎంత వస్తుంది అనేదాని మీద రకరకాల బెట్టింగ్ లు జరుగుతున్నాయి.మరీ ముఖ్యంగా సినీ నటుడు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పిఠాపురం నుంచి బరిలో ఉన్న సంగతితెలిసిందే.అయితే అప్పటి నుండి పిఠాపురం ఒక్కసారిగా టాక్ ఆఫ్ ఏపీ పాలిటిక్స్ గా మారింది.పవన్ గెలుపు, మెజారిటీ విషయంలో పందెం రాయుళ్లు జోరుగా డబ్బులు వెదజల్లుతున్నారు. వైకాపా వంగా గీత గెలుస్తుందని ఎవరైనా ధైర్యం చేస్తే రూపాయికి 30 రూపాయల కోసు పందెం కట్టడానికి పందెం రాయుళ్లు రెడీ. 50 వేల మెజార్టీ, 75 వేల మెజార్టీ, లక్ష మెజార్టీపై కూడా విరివిగా పందేలు జరుగుతున్నాయి.బెట్టింగ్ల మీద ఫోకస్ పెట్టిన కొంత మంది విశ్లేషకుల ప్రకారం ఈసారి కూడ అధికార పార్టీ వైసీపీ గెలిచి ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తుందని దానిపైనే ఎక్కువ బెట్టింగ్ జరుగుతుందని తెలుస్తుంది.j

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: