బీఆర్ఎస్ : ఖమ్మం ఎంపీ సీటుపై స్పెషల్ ఫోకస్..?

Pulgam Srinivas
కొన్ని రోజుల క్రితమే తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 వ సంవత్సరం జరిగిన ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అద్భుతమైన మెజారిటీని తెచ్చుకొని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్ట మొదటి సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇక ఆ తర్వాత 2019 వ సంవత్సరం జరిగిన ఎన్నికలలో కూడా టిఆర్ఎస్ పార్టీ సూపర్ సాలిడ్ మెజారిటీని తెచ్చుకొని మళ్లీ ప్రభుత్వాన్ని నెలకొల్పింది.

ఇలా రెండు సార్లు ప్రభుత్వాన్ని నెలకొల్పిన ఈ పార్టీ కి ఆ రెండు సార్లు కూడా భారీ స్థాయిలో లోక్సభ సీట్లు కూడా దక్కాయి. ఇక కొన్ని రోజుల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ భారీ సంఖ్యలో సీట్లు తెచ్చుకోలేదు. దానితో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నెలకొల్పే స్థాయి సీట్లను తెచ్చుకొని తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నెలకొల్పింది. ఇకపోతే బీఆర్ఎస్ పార్టీ ఎక్కువ అసెంబ్లీ స్థానాలను తెచ్చుకోవడంలో ఫెయిల్ అయినప్పటికీ మరికొన్ని రోజుల్లో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం దానిని అస్సలు రిపీట్ చేయొద్దు అని చూస్తోంది. అందులో భాగంగా ఈ సారి ఎన్నో ప్రణాళికల తర్వాత ఆచితూచి ఎంపీ అభ్యర్థులను కేటాయించారు.

ఇక ఈ సారి బీఆర్ఎస్ ప్రభుత్వం కొన్ని ప్రాంతాల ఎంపీ సీటులను చాలా కీలకంగా తీసుకుంది. అందులో ఒకటి ఖమ్మం సీటు. ఇందులో పోయినసారి భారీ మెజారిటీతో గెలుపొందిన సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వర్ రావు కే బీఆర్ఎస్ పార్టీ టికెట్ ను ఇచ్చింది. దానితో ఈయన కూడా ఇప్పటికే తనకు అద్భుతమైన కేడర్ ఉండడంతో భారీ ఎత్తున ప్రచారాలను చేస్తున్నాడు. అలాగే ఇతనికి కెసిఆర్ , కేటీఆర్ నుండి కూడా మంచి సపోర్ట్ లభిస్తుంది. దానితో ఈయన ఖచ్చితంగా ఈ ప్రాంతంలో గెలిచి తీరాలి అని చూస్తున్నాడు. మరి ఖమ్మం సీటు బీఆర్ఎస్ కి దక్కుతుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

brs

సంబంధిత వార్తలు: