మళ్లీ గెలిస్తే జనం భూములు జగన్ లాక్కుంటాడా?

Chakravarthi Kalyan
ఏపీ ఎన్నికల్లో అధికార పార్టీని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలకు లభించిన అస్త్రం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చట్టంపై ప్రస్తుతం పెద్ద దుమారమే రేగుతుంది. ఈ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఈ చట్టాన్ని ఉపయోగించుకుంటున్నారు అని సీఎం జగన్ ప్రతిపక్షాలకు కౌంటర్ ఇస్తున్నారు.

అయినా ఈ చట్టం గురించి గ్రామ స్థాయిలోకి వెళ్లిపోవడంతో వైసీపీకి కొంత ఇబ్బందికరంగా మారింది. తన మాట అయితే నమ్మరని ముందుగా చంద్రబాబు జనసేన అధినేత చేత దీనిపై విమర్శలు చేయించారు. ఆ తర్వాత ఈ అంశాన్ని తీసుకొని తన ఎల్లో మీడియా ద్వారా ఏ మేర మైలేజ్ తీసుకురావాలో అంతకు మించే సాధించారు. మొత్తంగా ఈ విషయంలో వైసీపీ కన్నా టీడీపీ ముందు వరుసలో ఉంది. ఈ క్రమంలో దీనిని తిప్పికొట్టేందుకు అధికార వైసీపీ ఆపసోపాలు పడుతోంది.

సీఎం జగన్ దీని గురించి మాట్లాడుతూ.. భూమిపై యజమానికి సర్వ హక్కులు కల్పించడమే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ముఖ్య ఉద్దేశమని.. రిజిస్ర్టేషన్ చేసుకున్నవారికి జిరాక్స్ పేపర్లు ఇస్తారనేది పూర్తి అవాస్తమన్నారు. భూములకు సంబంధించిన అతి పెద్ద సంస్కరణగా ఈ చట్టం గురించి చెప్పారు. ఈ సంస్కరణ ఏపీకి మాత్రమే సంబంధించిది కాదని.. దేశమంతా జరుగుతోందని వివరించారు.

కొత్త చట్టం వల్ల భూములకు రక్షణ లేకుండా పోతాయని.. తమకు తెలియకుండానే వేరే వ్యక్తులకు తమ భూములను కాజేసే అవకాశం ఉందని టీడీపీ నేతలు లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారు. అంతేకాకుండా ఒరిజినల్ పత్రాలు ఇవ్వడం లేదని కేవలం జిరాక్స్ లను మాత్రమే ఇస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు. కానీ వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. కొత్తగా రిజిస్ర్టేషన్ చేసుకున్న వారికి ప్రభుత్వం ఒరిజినల్ పత్రాలనే ఇస్తోంది. తాజాగా కొందరు తమ భూములు రిజిస్ర్టేషన్ చేసుకున్న చేయించుకున్న తర్వాత ఒరిజినల్ ధ్రువపత్రాలనే ఇచ్చారని.. చెబుతున్నారు. కొందరు సాక్ష్యంగా వీటిని చూపించారు కూడా. ఇప్పుడు వీటిని వైసీపీ తమ సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు యత్నిస్తోంది. మరి ఇది ఎంత మేర జనాలకు కనెక్ట్ అవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: