అతని వయస్సు వందేళ్లు.. కానీ మొదటిసారి ఓటు వేసాడు?

praveen
ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా కూడా ఎన్నికల హడావిడి నెలకొంది అన్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయ్. అయితే కొన్ని రాష్ట్రాలలో పార్లమెంట్ ఎన్నికలతో పాటు అటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతూ ఉండడం గమనార్హం. ఈ క్రమంలోనే ఇక దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా రాజకీయ వేడి కనిపిస్తుంది. అన్ని పార్టీలు కూడా అలర్ట్ అయిపోయి ప్రస్తుతం గెలుపు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక ఓటరు మహాశయులను ఆకట్టుకునేందుకు హామీల వర్షం కురిపిస్తున్నాయి అని చెప్పాలి. ఇక అన్ని పార్టీల అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతూ ఉన్నారు అని చెప్పాలి..

 అయితే ఇప్పటికే కొన్ని రాష్ట్రాలలో పోలింగ్ ప్రక్రియ కూడా పూర్తయింది. ఈ క్రమంలోనే ఫలితాలు ఎలా వస్తాయి అనే విషయంపై ఆసక్తి నెలకొంది అని చెప్పాలి. అయితే ఇలా ఎక్కడ చూసినా ఎన్నికల హడావిడి ప్రచార హోరు కనిపిస్తూ ఉండగా.. ఓటర్లకు అవగాహన కల్పించేందుకు అటు ఎన్నికల అధికారులు కూడా ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు అని చెప్పాలి. అదే సమయంలో కొంతమంది ఏకంగా వృద్ధాప్యంలో మొదటిసారి ఓటు వినియోగించుకోవడం లాంటి ఘటనలు కూడా హాట్ టాపిక్ గా మారిపోతున్నాయి. సాధారణంగా 18 ఏళ్లు వచ్చిన ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం ఉంటుంది.

 తమకు నచ్చిన నాయకుడికి ఓటు వేసి ఎన్నుకోవచ్చు.. ఇలా 18 ఏళ్ల నుంచి ఇక ఎన్నో ఎన్నికల్లో ఓటు వేయడం చేస్తూ ఉంటాడు సగటు ఓటర్. కానీ ఇక్కడ ఆ వ్యక్తికి వందేళ్ళ వయసు. కానీ ఇప్పటివరకు ఓటు వేయలేదు. కానీ మొదటిసారి ఇటీవలే ఓటు హక్కును వినియోగించుకున్నాడు. సార్వత్రిక ఎన్నికల్లో ఇటీవలే ఒక అరుదైన పరిణామం చోటుచేసుకుంది. జమ్మూకాశ్మీర్లో 100 ఏళ్లవృద్ధుడు తొలిసారి తన ఓటు హక్కు వినియోగించుకున్నాడు. శ్రీనగర్ పరిధిలోని జడిబల్ నియోజకవర్గం మీర్ బక్రీద్ ప్రాంతంలో ఇంట్లోనే తన ఓటు వేశాడు వందేళ్ల వృద్ధుడు. ఆయన ఇన్ని సంవత్సరాలు ఓటింగ్కు దూరంగా ఉండడానికి గల కారణాలు మాత్రం తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: