చిరంజీవి: కూటమికి దెబ్బ..పవన్ కి మాత్రమే అండ..!

Divya
ఆంధ్రప్రదేశ్లోని ఎన్నికల పోలింగ్ దగ్గర పడుతున్న కొద్ది అభ్యర్థులలో ఆందోళన పార్టీ అధినేతలలో టెన్షన్ నెలకొంటోంది.. ముఖ్యంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తరపున చిరంజీవి ప్రచారం చేస్తారని గత కొద్దిరోజులుగా వార్తలైతే వినిపిస్తున్నాయి.. అయితే ఇప్పుడు తాజాగా చిరంజీవి అయితే ప్రచారంలోకి రాలేదు కానీ తన తమ్ముడికి సపోర్ట్ చేయమంటూ ఒక వీడియో ద్వారా వెల్లడించారు.. పవన్ కళ్యాణ్ ఈసారి పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నారు. ఆయనకు ఓటు వేసి గెలిపించాలంటూ చిరంజీవి పిఠాపురం ప్రజలను కూడా వేడుకుంటున్నారు.

పవన్ కళ్యాణ్ రాజకీయాలలోకి వచ్చి అధికారం చేపట్టకముందే ఎంతో మంది రైతులకు సహాయం చేశారు తనకంటే జనం గురించి ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం తన తమ్ముడు పవన్ కళ్యాణ్ కి ఉందంటూ చిరంజీవి వివరించారు.. మృత్యుకారులతో పాటు ఎందరికో సహాయం చేసిన నాయకుడు పవన్ కళ్యాణ్ ఇలాంటి నాయకుడే జనాలకు కావాల్సింది అంటూ వివరించారు.. ఒక రకంగా చెప్పాలి అంటే పవన్ కళ్యాణ్ సినిమాలలోకి ఇష్టం లేకుండానే వచ్చారు.. కానీ రాజకీయాలలోకి మాత్రం తను ఇష్టపూర్వకంగానే వచ్చారని వెల్లడించారు
.

ఏ తల్లి కైనా తన కొడుకు కష్టపడుతూ ఉంటే చాలా బాధపడుతూ ఉంటారు.. అలా తన తల్లి కూడా తన తమ్ముడు కష్టపడుతూ ఉంటే చాలా బాధపడింది..కానీ అమ్మకు ఒకే మాట చెప్పాము నీ కొడుకు ఎంతోమంది తల్లుల కోసం వారి బిడ్డల యొక్క భవిష్యత్తు కోసమే ఇలాంటి యుద్ధంలో అడుగు పెట్టారని.. వారు పడుతున్న బాధ కంటే మనం పడే బాధ గొప్పది కాదు అంటూ చిరంజీవి వెల్లడించారు.. తాను బలంగా నమ్మిన సిద్ధాంతం కోసమే పవన్ కళ్యాణ్ రాజకీయాలలోకి వచ్చారని ప్రజల సేవకుడిగా.. సైనికుడిగా నిలబడతారని నమ్మకం తనకు ఉందని తెలిపారు. కేవలం పిఠాపురం ప్రజలకు మాత్రమే విన్నవించుకుంటున్నాను గాజు గ్లాస్ కు ఓటు వేసి గెలిపించండి అంటూ చిరంజీవి తన ట్విట్టర్ నుంచి వీడియో ద్వారా వెల్లడించారు. కానీ ఇక్కడ కూటమి గురించి మాత్రం చిరంజీవి అసలు మాట్లాడలేదు కేవలం తన తమ్ముడిని గెలిపించాలని మాత్రమే విన్నవించుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: