కేటీఆర్ : ప్రజల తీర్పును కచ్చితంగా గౌరవిస్తాం... కాకపోతే..?

Pulgam Srinivas
భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మల్కాజ్ గిరి పార్లమెంట్ పరిధిలోని కర్మన్ ఘాట్ లో జరిగిన రోడ్ షో లో తాజాగా పాల్గొన్నారు ఈ రోడ్ షో లో భాగంగా కేసీఆర్ మాట్లాడుతూ... కేసీఆర్ సీఎం అయితే హైదరాబాద్ బాగు పడుతదని మీరు ఎంతగానో నమ్మారు. అందుకే గ్రేటర్ పరిధిలో మాకు 16 సీట్లు ఇచ్చారు. కానీ జిల్లాలో ప్రజలు మాత్రం కాంగ్రెస్ హామీలు నమ్మి మోసపోయారు. రూ. 2500 , వృద్ధులకు రూ. 4 వేలు , రైతు భరోసా , తులం బంగారం అంటూ అలవి కానీ హామీలు ఇచ్చి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిండు. ఆ సమయంలో వారు చెప్పిన మాటలను ప్రజలు నమ్మరు. వారిని గెలిపించారు.

ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించి నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉన్నాం. కానీ రేవంత్ రెడ్డి నాలుగు నెలల్లో ఒక్కటంటే ఒక్క హామీ నిలబెట్టుకోలేదు. పైగా రాహుల్ గాంధీ తో కూడా పచ్చి అబద్దాలు చెప్పించినారు. నిర్మల్ సభలో రాహుల్ గాంధీ ప్రతి మహిళకు రూ. 2500 వచ్చినయ్ అని చెబుతుండు. నాకు నవ్వాలో... ఏడ్వాలో కూడా అర్థం కాని పరిస్థితి. రూ. 2500 , వృద్ధులకు రూ. 4 వేలు , తులం బంగారం , స్కూటీలు , రైతులకు రూ. 7500 , బోనస్ వచ్చాయా.. తెలంగాణ ప్రజలు పిచ్చోళ్లు ఏమీ చెప్పినా నమ్ముతారన్నట్లు మిమ్మల్ని తక్కువ అంచనా వేసి అబద్దాలు చెబుతున్నారు. రాహుల్ గాంధీ గారు అమాయకుడు.  వాళ్లు రాసిచ్చింది చదువుతాడు.

కానీ మీ రేవంత్ రెడ్డి అసలు ఈ ఎన్నికల తర్వాత నీతో ఉంటాడా చూసుకో. నేను ఊరికే ఈ మాటలు చెప్పటం లేదు. రేవంత్ వ్యవహారం చూశాకే ఈ మాటలు అంటున్నా. రాహుల్ గాంధీ చౌకిదార్ చోర్ అంటాడు. రేవంత్ రెడ్డి మాత్రం మోడీ బడే భాయ్ అంటాడు. రాహుల్ గాంధీ అదానీ ఫ్రాడ్ అంటాడు. రేవంత్  రెడ్డి అదానీ మేరా ఫ్రెండ్ అంటాడు. రాహుల్ గాంధీ గుజరాత్ మోడల్ ఫేక్ అంటాడు. రేవంత్ రెడ్డి మాత్రం గుజరాత్ మోడల్ తెస్తా అంటాడు. రాహుల్ గాంధీ లిక్కర్ స్కాం లేదు కేజ్రీవాల్ అరెస్ట్ తప్పు అంటాడు. రేవంత్ రెడ్డి మాత్రం కవితమ్మను అరెస్ట్ చేసుడు కరెక్టే అంటాడు అని తాజా సభలో కేటీఆర్ చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: