ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల లాభాలివే.. రైతులకు మేలని రామోజీనే చెప్పారా?

Reddy P Rajasekhar
ఏపీలో ప్రస్తుతం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చుట్టూ జరుగుతున్న రచ్చ అంతాఇంతా కాదు. రాష్ట్రంలో అధికారంలోకి రావాలనే ఆకాంక్షతో కూటమి నేతలు ఈ యాక్ట్ విషయంలో చేస్తున్న దుష్ప్రచారం అంతాఇంతా కాదు. టీడీపీ ఫేక్ ప్రచారంపై సీఐడీ ఇప్పటికే విచారణ మొదలుపెట్టగా చంద్రబాబు ఏ1గా లోకేశ్ ఏ2గా ఎఫ్.ఐ.ఆర్ ను నమోదు చేయడం జరిగింది. ఐ.వీ.ఆర్.ఎస్ కాల్స్ తో టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని వైసీపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు.
 
ఏపీ ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ అమలులోకి వస్తే భూమితో పాటు ఆ భూమి హక్కుదారు ఎవరో రిజిష్టర్ లో నమోదు చేయడం జరుగుతుంది. పేర్లలో వ్యత్యాసాలు, తేడాలు, తప్పులు ఉంటే ఆ సమస్యలను ఈ చట్టం ద్వారా పరిష్కరించుకోవచ్చు. ఈ టైటిల్ రిజిష్టర్ ను కన్‌క్లూజివ్‌ రికార్డుగా చూపించే అవకాశం ఉంటుంది. ఈ చట్టం అమలు చేయడం ద్వారా భూముల యజమానులకు భరోసా దక్కనుంది.
 
ఈ చట్టం అమలు ద్వారా భూ వివాదాలు దాదాపుగా పరిష్కారమవుతాయి. జిల్లా స్థాయిలో ఒక ట్రిబ్యునల్, రాష్ట్ర స్థాయిలో ఒక ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేయడం ద్వారా ఈ చట్టంతో భూ సమస్యలను పరిష్కరిస్తారు. ఈ చట్టం అమలు వల్ల భూములు అమ్మినా కొనినా మోసపోయే ఛాన్స్ ఉండదు. ఈ చట్టంతో భూమికి భద్రత లభిస్తుందని గతంలో రామోజీరావు సొంత పత్రిక, సొంత ఛానెళ్లలో కథనాలు వచ్చాయి. ఆ కథనాలకు సంబంధించిన ఆధారాలు సైతం ఉన్నాయి.
 
అప్పుడు పాజిటివ్ గా ఇప్పుడు నెగిటివ్ గా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ గురించి ప్రచారం చేస్తున్నారంటే రామోజీ అసలు ఉద్దేశం సులువుగా అర్థమవుతుంది. కూటమి అధికారంలోకి వస్తే మాత్రం ఈ చట్టాన్ని కచ్చితంగా రద్దు చేస్తుంది. ఎందుకంటే ఈ చట్టం పేరు అడ్డు పెట్టుకుని కూటమి రాజకీయాలు చేసింది కాబట్టి ఈ చట్టానికి కూటమి వ్యతిరేకంగా అడుగులు వేస్తుంది. ఈ చట్టంకు సంబంధించిన యూట్యూబ్ వీడియోను రామోజీ డిలీట్ చేయించారంటే ఈ చట్టం విషయంలో టీడీపీ వైఖరి ఏ విధంగా ఉందో సులువుగా అర్థమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: