ష‌ర్మిల ఉద్దేశం వేరు.. చేస్తోంది వేరు... అస‌లు ప్లాన్ ఇదా అమ్మా...?

RAMAKRISHNA S.S.
కాంగ్రెస్ పీసీసీ చీఫ్‌, ఏపీ సీఎం జ‌గ‌న్ చెల్లెలు.. వైఎస్ ష‌ర్మిల ఒక‌వైపు అన్న ప్ర‌భుత్వాన్ని తిడుతున్నారు. ఏమీ చేయ‌లేద‌ని కూడా అంటున్నారు. వివేకా హంత‌కుల‌కు ర‌క్ష‌ణ క‌ల్పిస్తున్నార‌ని చెబుతున్నారు. ఊరూ వాడా ప్ర‌చారంలో ఈ విష‌యాలే దంచి కొడుతున్నారు. ఇవి చాల‌వ‌న్న‌ట్టుగా.. ఎన్నిక‌ల‌కుముందు.. బ‌హిరంగ లేఖ‌ల పేరుతో.. `న‌వ సందేహాల‌` చిట్టాలు విప్పుతు న్నారు. బుధ‌వారం న‌వ‌సందేహాలంటూ.. తొలి లేఖ సంధించిన ష‌ర్మిల‌.. గురువారం దానికి కొన‌సాగింపుగా.. మ‌రో న‌వ‌సందేహా ల పార్ట్‌-2 లేఖ రాశారు.

ఇక్క‌డ చెప్పుకోవాల్సింది ఏంటంటే.. ష‌ర్మిల ఏవైతే.. ప్ర‌సంగాల్లో దంచి కొడుతూ.. అన్న‌ను ఇర‌కాటంలోకి నెట్టాల‌ని అనుకుంటు న్నారో.. అవే అంశాల‌ను ప్ర‌శ్న‌లుగా మార్చి న‌వ‌సందేహాలు పేరుతో లేఖ‌లు సంధి స్తున్నారు. వీటిలో పెద్ద తేడా ఏమీ లేదు. అంతేకాదు..వీటిలో సందేహాలు కూడా లేవు. ప్ర‌చారంలో చేస్తున్న అంశాల‌నే ప్ర‌శ్న‌లుగా మార్చి .. మ‌రింత షార్పుగా వ్య‌తిరేక‌త తీసుకురావ‌డ‌మే.. ఈ లేఖల ఉద్దేశం. దీనిలో..ఎవ‌రికీ ఎలాంటి సందేహం లేదు. ఎటొచ్చీ.. అస‌లు సందేహం.. ష‌ర్మిలే..!

ఆశ్చ‌ర్యంగా ఉన్నా.. ఇది నిజమేన‌ని జ‌నాల నుంచే టాక్ వినిపిస్తోంది. ఎన్నిక‌ల వేళ‌.. జ‌గ‌న్ను తిట్టి ప్ర‌యో జ‌నం పొందాల‌ని అనుకునేవారు ఎవ‌రైనా కూడా.. ఈ ఐదేళ్ల‌కు ప్ర‌జ‌ల మ‌ధ్య ఉండి ఉండాలి. క‌రోనా స‌హా.. ఎల్జీ పాలిమ‌ర్స్ వంటి దుర్ఘ‌ట‌న‌లు జ‌రిగిన‌ప్పుడు.. ప్ర‌జ‌లను ఆదుకునైనా ఉండాలి. అదేవిధంగా వ‌లంటీర్ల వ్య‌వ‌స్థ‌ను స‌మ‌ర్థించిన వారైనా ఉండాలి. కానీ.. ఇవేవీ చేయ‌కుండా.. కేవ‌లం లోపాలు మాత్ర‌మే వెతుకుతాం.. అంటే.. ప్ర‌జ‌లు న‌మ్ముతారా? అనేది ష‌ర్మిల చుట్టూ తిరుగుతున్న ప్ర‌ధాన సందేహం.

వైఎస్ ప‌థ‌కాలు అమ‌లు కావ‌డం లేదు.. అని ష‌ర్మిల పాత ప్ర‌చారాన్ని.. కొత్త సందేహం రూపంలో విని పిస్తున్నారు. ఆరోగ్య‌, ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్‌, రైతు భ‌రోసా, ఉచిత విద్యుత్‌, డ్వాక్రా సంఘాల బ‌లోపేతం, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి వంటివి జ‌రుగుతున్న‌ట్టు సొంత నేత‌లే చెబుతున్నారు. అంతెందుకు.. కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ ర‌ఘువీరారెడ్డి స్వ‌యంగా రైతు భ‌రోసా నిధులు తీసుకున్నారు..! ఇది ఆశ్చ‌ర్యం కాదు. ప‌చ్చి నిజం.

అదేవిధంగా పార్టీ సీనియ‌ర్ నేత తుల‌సి రెడ్డి మ‌న‌వ‌లు ముగ్గురు ఫీజు రీయింబ‌ర్స్ మెంట్ అందుకున్నారు. ఇది నిజం కాద‌ని ష‌ర్మిల చెప్ప‌గ‌ల‌రా ?  అస‌లు సందేహం ఆమే కావ‌డం.. వాటికి స‌మాధానాలు చిక్క‌క‌పోవ‌డంతోనే.. ఈ స‌మ‌స్య వ‌స్తోంద‌న్న‌ది.. ప‌రిశీల‌కులు చెబుతున్న క‌రుకైన మాట‌.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: