చిలకలూరిపేట: నాన్ లోకల్ కావటి వైసీపీ విక్టరీని రిపీట్ చేస్తాడా?

FARMANULLA SHAIK
* కావటి ప్రచారానికి కనబడని ప్రజా ఊపు
* అంతర్మధనం పడుతున్న వైసీపీ నేతలు

పల్నాడు - ఇండియా హెరాల్డ్ : ఆంధ్రప్రదేశ్లో జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు గత నాలుగు నెలల నుండి రాష్ట్రంలో విచిత్రమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి.గత ఎన్నికల్లోో జగన్ వేవ్ లో చిలకలూరిపేట నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే గా గెలిచి విడుదల రజిని మంత్రి పదవి చేపట్టారు. అప్పటినుంచి రజిని చిలకలూరిపేట అభివృద్ధికి ఏ మాత్రం పాటుపడలేదని స్థానికులు అంటున్నారు. అయితే ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో దానిని గమనించిన వైసీపీ అధిష్టానం ఆమెను అక్కడ నుండి గుంటూరు పశ్చిమానికి స్థానచలనం చేశారు.స్థానికుడైన పత్తిపాటి పుల్లారావు పై విజయం సాధించే లక్ష్యంగా పెట్టుకున్న వైసీపీ మొదట్లో రాజేష్ నాయుడు ని సమన్వయకర్తగా ప్రకటించింది.అయితే రాజేష్‌ నాయుడు గత మూడునెలలుగా చిలకలూరిపేటలో చురుగ్గా పనిచేస్తున్నా ఆర్థిక సంబంధ వ్యవహారాల్లో అధిష్టానం ఆశించిన విధంగా ఖర్చు చేయడం లేదని భావించిన పార్టీ అధిష్టానం ఆయన్ను కూడా మార్చి గుంటూరు మేయర్‌ కావటి మనోహర్‌ నాయుడ్ని పేట నుండి పోటీ చేయమని సూచించింది.సహజంగా రాజకీయాల్లో నేను లోకల్‌ అనే నినాదంతో  గెలిచే వారిని చూశామని కానీ అక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి అక్కడికి మార్పులు జరగడం ఈసారి ఎన్నికల్లో విచిత్రంగా ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి.

ఒకవైపు గుంటూరు మునిసిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌గా ఉన్న కావటి మనోహర్‌ నాయుడు టికెట్‌ కోసం ప్రయత్నిస్తు ఉండడంతో రజనీ మంత్రిగా ఉన్నందు వల్ల ఆమె పరపతిని ఉపయోగించుకుని సిఎం వద్ద మనోహర్‌నాయుడు తనకు ఎమ్మెల్యే సీటు కావాలనే విషయాన్ని చెప్పి చిలకలూరిపేట ఇన్‌చార్జీగా నియమించిన రాజేష్‌ నాయుడుని తప్పించి మనోహర్‌ నాయుడుకి అవకాశం కల్పించుకునేలా చేసుకున్నారు.అయితే లోకల్ గా ఉన్న టీడీపీ అభ్యర్థి అయిన పత్తిపాటి పుల్లారావు ను ఢీకొట్టడం అంత సులభ మేమి కాదని గ్రహించిన కావటికి ప్రస్తుతం భయం వెంటాడుతుంది. మరో వారం రోజుల్లో ఎన్నికలు జరగనున్న కావటి ప్రచారం మాత్రం చప్పగా ఉండనే చెప్పాలి.పేట నియోజకవర్గంలోని కొన్ని గ్రామాల్లో వైసీపీ అభ్యర్థి ఎవరు అనే సంగతి కూడా తెలియని పరిస్థితిలో ప్రజలు ఉన్నారు. అయితే అక్కడ పుల్లారావు గెలుపు ఖాయమని ప్రజలు కరాకండిగా తేల్చి చెప్పేస్తున్నారు.చివరిగా చిలకలూరి పేట నియోజకవర్గంలో స్పష్టమైన మార్పు అనేది కనిపిస్తోందన్నది అక్కడ ప్రజల మాట.క్షేత్రస్థాయిలో పుల్లారావుకు లభిస్తున్న ఆదరణ టీడీపీ ప్రకటించిన సూపర్ సిక్స్‌, పుల్లారావు కుటుంబానికి దక్కుతున్న సింపతీ వంటివి ఆ పార్టీకి బాగా ప్లస్‌గా మారాయి. ఇక, వైసీపీలో సమన్వయ లోపం, నాయకుల మధ్య అంతర్గత కుమ్ములాటలు వంటివి ఆ పార్టీకి తీరని లోటుగా మారాయి. దాంతో సైకిల్ గెలవడం ఖాయమని అంటున్నారు ఇక్కడి ప్రజలు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: