జగన్: అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి సంతకం అదే..!

Divya
ఆంధ్రప్రదేశ్లోని ఎన్నికల యుద్ధం మాటలు యుద్దంగా రోజురోజుకి పెరుగుతూనే ఉంది.. ముఖ్యంగా అటు వైసిపి టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పనులు చేస్తామంటూ దూకుడు చూపిస్తున్నారు.. ఇటీవల చంద్రబాబు కూడా తన మొదటి సంతకం భూ సర్వేలన్నీ రద్దు చేస్తానని కూడా తెలిపారు.. అలాగే పింఛన్ల పెంపు వంటి వాటి పైన కూడా చేస్తానంటూ వెల్లడించారు.. ఇప్పుడు తాజాగా సీఎం జగన్ మాట్లాడుతూ తాను అధికారంలోకి వచ్చిన వెంటనే తన మొదటి సంతకం వాలంటరీలను పునరుద్ధరించడమే అన్నట్లుగా తెలియజేశారు..

ఇటీవలే ప్రకాశం జిల్లాలోని కనిగిరిలో నిర్వహించిన సభలో జగన్ మాట్లాడుతూ తాను అధికారంలోకి వస్తే ఇంటి వద్దకి నేరుగా పెన్షన్ పంపిణీ  మళ్ళీ చేస్తానంటూ తెలిపారు.. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని పథకాలు మళ్లీ అమలు అవుతాయని కాబట్టి ప్రజలు ఆలోచించి ఓటు వేయమని కోరుతున్నాం అంటూ వెల్లడించారు.. ఎప్పుడైతే చంద్రబాబు పాపిష్టి కళ్ళు పడ్డాయో అప్పటినుంచి పెన్షన్ అందుకోవడంలో చాలామంది లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారని కూడా వెల్లడించారు సీఎం జగన్. ప్రతినెల 1వ తారీఖున సూర్యుడు ఉదయించే లోపు కచ్చితంగా పెన్షన్ మీ ఇంటి ముందు ఉండేది కానీ ఇప్పుడు ఆగిపోయిందని వెల్లడించారు.

చంద్రబాబు వల్లే బ్యాంకుల చుట్టూ వృద్ధులు తిరిగి ఎండలో నడిరోడ్డు పైన పడేలా చేశారంటూ కూడా విమర్శించారు. 14 ఏళ్లుగా చంద్రబాబు పాలన ప్రజలు చూశారని తన పాలన 57 నెలలలోనే చూశారని తెలిపారు.. తాను చేసిన 14 ఏళ్లలో ఏ రోజైన పెన్షన్లకు ఇంటి వద్దకు డబ్బులు పంపారా చంద్రబాబు అంటూ నిలదీశారు.. కేవలం ఒక్క నెల ఓపిక పట్టండి మళ్లీ అధికారంలోకి వస్తామంటూ తెలిపారు జగన్.. మూడుసార్లు సీఎం అయ్యారని చెప్పుకుంటున్న ఓ పెద్దమనిషి నువ్వు చెప్పుకోవడానికి ఏ పథకమైన ఉందా అంటూ అడుగుతున్నాను అంటూ నిలదీశారు. 2014లో మేనిఫెస్టో చూపించి ప్రజలను మోసం చేస్తున్నారంటూ తెలిపారు జగన్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: