రాయలసీమ: కూటమి పరిస్థితి మరీ అంత దారుణమా..?
అలాగే బద్వేలులో కూటమి ఒక్కటిగా ఉంది.. మేమంతా ఒకే మాట మీద ఉన్నామని చెప్పడానికి ఎంత ప్రయత్నిస్తున్న లోపల మాత్రం చాలా తేడాలే ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది.. టిడిపి క్యాడర్ లోని జనసేన జెండాలు మోయడానికి సిద్ధంగా ఉన్న బిజెపిని మాత్రం ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరని గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో కొన్నిసార్లు బయట నుంచి మరి మనుషులని అరువు తెప్పించుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బద్వేలలో 2004 నుంచి ఇప్పటివరకు టిడిపి ఖాత అస్సలు తెరవలేదు.
2004 వరకు ఇది టిడిపికి కంచుకోట.. వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రాబల్యం వల్ల మొత్తం అక్కడొక్కసారిగా సీను మారిపోయింది. చివరి ఎన్నికల వరకు కూడా టిడిపికి ఎదురు దెబ్బలు ఇక్కడ తగులుతూనే ఉన్నాయట. ఇలాంటి సమయంలో అంతగా లేనటువంటి క్యాడర్ బిజెపికి ఇక్కడ టికెట్ ఇచ్చిందో టిడిపికి అర్థం కావడం లేదు. ముఖ్యంగా 2004 నుంచి ఇప్పటివరకు టిడిపి గెల్చలేదు కాబట్టి.. ఒకవేళ ఈసారి కూడా ఓడిపోతే ఆ ఖాతాను బిజెపి పైన తోసేయచ్చని వాదన అక్కడ చాలా బలంగా వినిపిస్తున్నది. యువ గళం పాదయాత్రలో రితీష్ కుమార్ రెడ్డి జోష్ నింపగా అనుకోకుండా బిజెపి సీటు ఇక్కడ రావడంతో హఠాత్తుగా సిన్ మారిపోయింది. దీంతో ఒక్కసారిగా టిడిపి క్యాడర్ మొత్తం అక్కడ నిరుత్సాహ పడిందట. బిజెపి నుంచి రోషన్న నిలబడ్డారు. ఇలా మొత్తానికి బద్వేల్ వ్యవహారంలో అటు టిడిపి బిజెపి న్యాయకత్వం చాలా తలనొప్పికరంగా మారుతున్నదట్లు టాక్ వినిపిస్తోంది..