ఏపీ: చిత్తూరులో వారి గెలుపు ఖాయమట?

Suma Kallamadi
ఆంధ్రాలో సార్వత్రిక ఎన్నికల వేళ చాలా ఆసక్తి కరమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో పుంగనూరు నియోజకవర్గం గురించి ఇక్కడ ప్రత్యేకించి మాట్లాడుకోవాలి. ఈ నియోజకవర్గంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు విపక్షమీద దాడులు దౌర్జన్యాలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసినదే. వీరు తాజాగా చౌడేపల్లి మండల టీడీపీ అధ్యక్షుడు రమేష్ రెడ్డి వాహనంపై దాడి చేసి ధ్వంసం చేసిన సంగతి కూడా విదితమే. ఇటువంటి ఘటనలు అధికార వైసీపీకి ఇపుడు చాలా తలనొప్పిగా మారాయి అనడంలో అతిశయోక్తి లేదు.
అంతేకాకుండా తిరుపతిలో 2019 వరకు ఒకటి, ఇప్పుడు ఒకలాంటి పరిస్థితులు నెలకొన్నాయి అని వేరే చెప్పాల్సిన పనిలేదు. అవును, 2 ప్రాంతాల్లో తప్ప మిగిలిన చోట్ల ఎల్లవేళలా ప్రశాంతంగా ఎన్నికలు జరిగేవి. అయితే ఇపుడు పరిస్థితి భిన్నంగా ఉంది. ఇపుడు తిరుపతిలో ఎన్నికలంటేనే సగటు ఓటరుకు వెగటు, భయం పుట్టేలా పరిస్థితిని ఉందని వేరే చెప్పక్కర్లేదు! వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జరిగిన గొడవలు, రాళ్లదాడులు, దొంగ ఓటర్ల తంతు విషయం స్థానికులను భయబ్రాంతులకు గురి చేసింది. స్థానిక సంస్థల ఎన్నికలు మొదలకుని ఎంపీ ఉప ఎన్నిక, టౌన్‌బ్యాంకు, ఎమ్మెల్సీ ఎన్నికలు ఏ విధంగా జరిగాయో దేశం మొత్తం చూసింది.
ఇక అలాంటి వాతావరణం సృష్టించి గత ఎన్నికల్లో పై చేయిగా నిలిచిన వైసీపీ శ్రేణులు ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లోనూ అదే పంథాను అనుసరించే సూచనలు మెండుగా కనబడుతున్నాయి. ఇక్కడ టీడీపీ, బీజేపీ బలపరుస్తున్న జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు నామినేషన్‌ వేసినప్పటి నుంచి వైసీపీ శ్రేణుల్లో మిక్కిలి ఆందోళన మొదలైంది. దానికి ఆరణి ర్యాలీఏ ప్రత్యక్ష సాక్షి. అక్కడికి లక్షల్లో తరలి వచ్చిన జన వాహినిని చూసి వైసీపీ నాయకులు కుట్రకు తెరలేపినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. అవును, జనసేన అభ్యర్థి ప్రచారం చేపట్టే ప్రాంతాల్లో ముందుగా వైసీపీ శ్రేణులు వాలిపోయి కవ్వింపు చర్యలకు దిగుతున్నాయి. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఒక విషయం బాగా వినబడుతోంది. కొందరు రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం... రానున్న ఎన్నికల్లో వైస్సార్సీపీ కర్మకు ప్రతిఫలం అనుభవించనుంది అనే అంశం నిజం కాబోతోంది అనే విషయాన్ని ఓటర్లు నిజం చేసేలా ఉన్నారు!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: