వైసీపీ గెలిచే సీట్లపై పచ్చ పత్రిక లెక్కలివే.. అన్ని సీట్లలో విజయం సాధిస్తుందట!

Reddy P Rajasekhar
ఏపీలో వైసీపీ ఎన్ని సీట్లలో గెలుస్తుందనే ప్రశ్నకు సమాధానం చెప్పడం ఆ పార్టీ నేతల వల్ల కూడా కావడం లేదు. ఒక్కో సర్వే ఫలితాలు ఒక్కో విధంగా ఉండటం, చాలా నియోజకవర్గాలలో పరిస్థితులు శరవేగంగా మారిపోతుండటంతో ఏ పార్టీ గెలుస్తుందో చెప్పడం సులువు కాదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అయితే కూటమికి ఎప్పుడూ అనుకూలంగా వ్యవహరించే ఒక పచ్చ పత్రిక మాత్రం వైసీపీ 50 నుంచి 60 స్థానాలలో విజయం సాధిస్తోందని చెబుతోంది.
 
అయితే వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయో అంచనా వేసి చెబుతున్న ఆ పత్రిక కూటమికి ఎన్ని సీట్లు వస్తాయో మాత్రం చెప్పడం లేదు. విచిత్రం ఏంటంటే వైసీపీ అంతర్గత సర్వేలలో 60 సీట్లు వస్తాయని తేలిందని ఆ పత్రిక చెబుతోంది. ఆ పత్రిక 60 సీట్లు అని చెప్పిందంటే వైసీపీ సులువుగా 90కు పైగా సీట్లలో విజయం సాధిస్తుందని వైసీపీ నేతలు వెల్లడిస్తున్నారు.
 
ఆ పచ్చ పత్రిక గత ఐదేళ్లలో ఏనాడైనా నిజం రాసిందా అని ఈ సందర్భంగా వైసీపీ నేతలు ప్రశ్నిస్తుండటం గమనార్హం. ఆ పత్రిక నియోజకవర్గాల వారీగా ఫలితాలను ప్రకటించి ఉంటే బాగుండేదని మరి కొందరు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు కూటమి తుది మేనిఫెస్టో ఈ నెల 30వ తేదీన విడుదల కానుందని సమాచారం అందుతోంది. సూపర్ సిక్స్ కు అదనంగా కూటమి ఏ హామీలను ప్రకటిస్తుందో చూడాల్సి ఉంది.
 
మరోవైపు కూటమి ప్రకటించే హామీలకు మోదీ నుంచి ఏమైనా హామీ లేదా గ్యారంటీ లభిస్తుందేమో చూడాల్సి ఉంది. మోదీ నుంచి హమీ లభిస్తే మాత్రం టీడీపీ కేంద్రం సహాయసహకారాలతో సులువుగానే ఇచ్చిన హామీలను నెరవేర్చే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఎన్నికలకు 14 రోజుల సమయం మాత్రమే ఉండగా ఆ సమయానికి ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది. మేనిఫెస్టో హామీలు 20 నుంచి 30 నియోజకవర్గాల్లో ఫలితాలను ప్రభావితం చేసే ఛాన్స్ అయితే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: