రిషబ్ పంత్ పై నిషేధం.. ఢిల్లీకి కొత్త కెప్టెన్?

praveen
2024 ఐపిఎల్ సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు భారీ అంచనాల మధ్య బరిలోకి దిగింది అన్న విషయం తెలిసిందే. దాదాపు ఏడాదిన్నర కాలం తర్వాత అటు రిషబ్ పంత్ మళ్లీ ప్రొఫెషనల్ క్రికెట్ లోకి అడుగుపెట్టగా.. అతని సారథ్యంలోనే ఈ సీజన్లో ప్రస్థానాన్ని మొదలుపెట్టింది ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు. ఈ క్రమంలోనే ఈ జట్టు ప్రదర్శన పై అందరికీ భారీగానే అంచనాలు ఉన్నాయి అని చెప్పాలి. ఇక అంచనాలకు తగ్గట్లుగానే తమ ప్రదర్శనతో పరవాలేదు అనిపిస్తుంది ఢిల్లీ జట్టు.

 ఇప్పుడు వరకు 12 మ్యాచ్లు ఆడిన ఢిల్లీ క్యాపిటల్స్ 6 విజయాలు సాధించింది. ఇక పాయింట్లు పట్టికలో ఐదవ స్థానంలో కొనసాగుతుంది. ఇటీవల చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఓటమితో ఇక ఢిల్లీ క్యాపిటల్స్ కి అటు ప్లే ఆఫ్ లో అవకాశం దక్కించుకునేందుకు ఛాన్స్ లు మరింత మెరుగయ్యాయి అని చెప్పాలి. అయితే ఢిల్లీ ఇలా వరుస విజయాలు సాధిస్తున్నప్పటికీ.. ఆ జట్టును స్లో ఓవర్ రేట్ జరిమాణాలు మాత్రం వేధిస్తూనే ఉన్నాయి. ఏకంగా జట్టు కెప్టెన్ గా ఉన్న రిషబ్ పంత్ కి ఏకంగా మూడుసార్లు స్లో ఓవర్ రేట్ కారణంగా జరిమానా పడింది అన్న విషయం తెలిసిందే. ఇలా స్లో ఓవర్ రేట్ కారణంగా జరిమానా పడటమే కాదు అతనికి బిగ్ షాక్ తగిలింది అన్నది తెలుస్తుంది.

 నేడు ఆర్సిబి తో జరగబోయే మ్యాచ్ కి ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ గా కొనసాగుతున్న రిషబ్ పంత్ వై నిషేధం పడనుంది. ఇలా ఒక మ్యాచ్ సస్పెన్షన్ కారణంగా ఇక తమ జట్టు కెప్టెన్ గా అక్షర పటేల్ ఎంపిక చేస్తున్నట్లు ఢిల్లీ క్యాపిటల్స్ ఇటీవల ప్రకటించింది. ఇలా ఈ ఐపిఎల్ సీజన్లో మూడుసార్లు స్లో ఓవర్ రేట్ నమోదు చేయడం కారణంగా రిషబ్ పంత్ పై ఒక మ్యాచ్ సస్పెన్షన్ తో పాటు 30 లక్షల జరిమానా విధిస్తూ ఐపీఎల్ గవర్నమెంట్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. అయితే ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ పై ఇలా నిషేధం పడటంతో అటు అభిమానులు అందరూ కూడా నిరాశలో మునిగిపోయారు. మరి రెగ్యులర్ కెప్టెన్ లేకుండా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఆర్సిబి తో మ్యాచ్ లో ఎలా రాణిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: