ఏపీ : జనసేన మద్దతుగా సినీ గ్లామర్..అసలు కారణం..?

FARMANULLA SHAIK
ఆంధ్రప్రదేశ్లో  సోమవారం జరగనున్న ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. రేపటి పోలింగ్ ఒక రాష్ట్ర పండుగలాగా కన పడుతుంది. ఎటు చూసినా నేతలతో, కార్యకర్తలతో వీధుల్లో హడావిడిగా ఉంది.అధికార పార్టీ వైసీపీని ఎలాగైనా సరే కూల్చానన్న ఉద్దేశంతో టిడిపి జనసేన బిజెపి కలిసి ఉమ్మడిగా వస్తున్న సంగతి తెలిసిందే. కూటమిలో భాగంగా పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ గారు బరిలో ఉన్నారు. గత ఎన్నికలలో ఓటమి పాలైన పవన్ కళ్యాణ్ ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా తన స్టైల్లో దూసుకుపోతున్నారు. ఆయనకు గత ఎన్నికలలో  పెద్దగా సపోర్ట్ చేయలేదు. ఈసారి మాత్రంసినీ తారలు చాలామంది పవన్ కు మద్దతుగా నిలిచారు.దాంట్లో భాగంగానే ఇటీవల రెబల్ స్టార్ దివంగత నేత కృష్ణంరాజు గారి సతీమణి అయిన శ్యామలా దేవి గారు కూడా పవన్ కు మద్దతుగా నిలిచారు.ఇప్పటికే జబర్దస్త్ నటులు, మెగాస్టార్ చిరంజీవి, నేచురల్ స్టార్ నాని, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన మద్దతు తెలుపుతూ వీడియోలు, పోస్ట్‌లు రిలీజ్ చేశారు. తేజా సజ్జా, రాజ్ తరుణ్ వంటి యంగ్ హీరోలు సైతం పవన్ కల్యాణ్‌కు తమ మద్దతు తెలిపారు.స్టార్ బ్యూటీ శ్రీలీల, అల్లు అర్జున్, ప్రొడ్యూసర్ నాగవంశీ కూడా  సోషల్ మీడియా ద్వారా సపోర్ట్ చేసారు.

 అయితే తాజాగా శ్యామల దేవిగారు మాట్లాడుతూ పిఠాపురంలో అత్యధిక మెజారిటీతో పవన్ కల్యాణ్ గెలుపు ఖాయం అని అన్నారు.నాకు తెలిసి ఈసారి అత్యధిక మెజారిటీతో రాష్ట్రంలోనే పవన్ కళ్యాణ్ మొదటి స్థానంలో ఉంటారని జోస్యం పలికారు.మరోవైపు శ్యామలాదేవి తాజాగా బీజేపీ తరపున కూడా ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. నరసాపురంలో కూటమి తరపున పోటీ చేసే అభ్యర్థిని గెలిపించాలని ఆమె కోరారు.గతంలో కృష్ణంరాజు కూడా ప్రజారాజ్యం పార్టీ నుంచి ఎంపీ గా పోటీ చేశాడు. కాబట్టి మెగా ఫ్యామిలీకి, కృష్ణంరాజు గారికి మొదటి నుంచి కూడా చాలా మంచి ఫ్రెండ్షిప్ అయితే ఉంది. ఇక దానివల్లే కృష్ణంరాజు ఉంటే కూడా జనసేన పార్టీకి సపోర్ట్ చేసేవాడు. ఇప్పుడు ఆయన లేడు కాబట్టి ఆ బాధ్యతను శ్యామల దేవి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇదంతా చూస్తుంటే శ్యామల దేవి వెనకాల ప్రభాస్ ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది.గత ప్రభుత్వంలో సినీప్రముఖులు అందరూ ఒకసారి సీఎం జగన్ ను కలిసి సినీ ఇండస్ట్రీ కి సంబంధించి మాట్లాడారు కానీ దానికి జగన్ నుండి స్పందన సరిగ్గా అందలేదు. దానితో అసంతృప్తికి గురైన సినీ ప్రముఖులు ఎలాగైనా జగన్ ను గద్దె దింపే ఆలోచనలో ఉన్నట్లు తెలిస్తుంది దాని కోసమే పవన్ కళ్యాణ్ ను గెలిపించి కూటమి అధికారం చేపట్టేలా చేయడానికి పవన్కుమద్దతు ఇస్తున్నట్లు విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: