నెల రోజుల‌కే స్నేహితులు కాస్తా శ‌త్రువులు అయ్యారే... ఎంపీ అయ్యే ల‌క్ ఎవ‌రిదో...?

RAMAKRISHNA S.S.
- ఒంగోలు వేదిక‌గా మాగుంట వ‌ర్సెస్ చెవిరెడ్డి
- మూడు ఎన్నిక‌ల నుంచి పార్టీ మారుతోన్న మాగుంట‌
- ఒంగోలు ఓట‌రు చిత్తూరు చెవిరెడ్డికి ప‌ట్టం క‌డ‌తారా.. పాత నేత‌నే గెలిపిస్తారా ?
( ఒంగోలు - ఇండియా హెరాల్డ్ )
నెలరోజుల ముందు వరకు వారిద్దరూ ఒకే పార్టీలో ఉన్నారు. మంచి స్నేహితులు కూడా. అలాంటి ఆ ఇద్దరు నేతలు ఇప్పుడు పార్టీలు మారి ఒకే నియోజకవర్గంలో పోటీపడుతూ.. బద్ధ శత్రువులుగా మారిపోయారు. పైగా ఇద్దరు రెడ్డి సామాజిక‌ వర్గానికి చెందిన నేతలు. ఇంకా చెప్పాలంటే టెక్నికల్‌గా ఇద్దరు ఆ పార్లమెంటు నియోజకవర్గానికి నాన్ లోకల్ వారు కావటం విశేషం. ఆ ఇద్దరు ఎవరో కాదు. ఒంగోలు పార్లమెంటుకు టీడీపీ నుంచి పోటీ చేస్తున్న సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, అక్కడే వైసీపీ నుంచి పోటీ చేస్తున్న చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావటం విశేషం.

ఈసారి ఎందుకో గాని మాగుంటకు సీటు ఇవ్వడం జగన్ కు ఇష్టం లేదు.. ఆయనకు సీటు ఇప్పించుకోవాలని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఎంత పట్టు పట్టిన జగన్ ఒప్పుకోలేదు. దీంతో తనకు అత్యంత స‌న్నిహితుడైన‌ చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డిని తీసుకువచ్చి ఒంగోలు పార్లమెంటు బ‌రిలో దింపారు. చిత్తూరు జిల్లాకు చెందిన చెవిరెడ్డి ఒంగోలు పార్లమెంటుకు పూర్తిగా నాన్ లోకల్. ఇక నెల్లూరు జిల్లాకు చెందిన మాగుంట కూడా ఒంగోలుకు నాన్ లోకల్. అయినా రెండున్నర దశాబ్దాలుగా ఒంగోలుతో వారి రాజకీయాలు పెనవేసుకుపోయాయి. ఇప్పుడు ప్రకాశం జిల్లా ప్రజలు ఎవరు మాగుంట శ్రీనివాస్ రెడ్డిని నాన్ లోకల్ వ్యక్తిగా చూడరు.

తమ జిల్లాకు చెందిన వాడిగానే ఓన్ చేసుకున్నారు. చెవిరెడ్డి ఒంగోలుకు పూర్తిగా కొత్త వ్యక్తి కావడంతో కేవలం జగన్ క్రేజ్ పార్టీ గుర్తు మీద మాత్రమే ఆశలు పెట్టుకున్న పరిస్థితి. ఇక మాగుంట కు మాత్రం టీడీపీతో పాటు వ్యక్తిగత ఇమేజ్, రెండున్నర దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో చేసిన సేవలు ఇవన్నీ కలిసి వస్తున్నాయి. అలాగే ప్రకాశం, నెల్లూరు జిల్లాలో వెనుక బడిన‌ ప్రాంతాల్లో ఎన్నో విద్యాసంస్థలు కూడా ఏర్పాటు చేశారు. తాగునీటి సమస్య పరిష్కారానికి ఆయన ఎంతో కృషి చేశారు. ఆ కృతజ్ఞత ఇప్పటికీ ఆ ప్రాంత ప్రజల్లో ఉంది. మాగుంట కుటుంబానికి ఒంగోలు పార్లమెంటు పరిధిలో ప్రత్యేకమైన ఓటు బ్యాంకు ఉంది.

మామూలుగా అయితే పశ్చిమ ప్రాంతంలో కనిగిరి, గిద్దలూరు, మార్కాపురం, ఎర్రగొండపాలెంతో పాటు జిల్లా కేంద్రం ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ బలంగా ఉంది. కానీ ఇక్కడ ఎంపీగా మాగుంట పోటీ చేస్తూ ఉండడంతో ఈసారి గట్టి ప్రభావం ఉంటుందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 2014లో మాగుంట ఇక్కడ ఎంపీగా ఓడిపోయిన కేవలం 13 వేల ఓట్ల తేడాతో మాత్రమే ఓడిపోయారు. దీనిని బట్టి ఇక్కడ మాగుంటకు పర్సనల్ ఓటు బ్యాంకు ఏ స్థాయిలో ఉందో తెలుస్తోంది. ఏది ఏమైనా పాత స్నేహితుల మధ్య జరుగుతున్న ఈ ఆసక్తికర సమరంలో ఎవరు గెలిచి పార్లమెంటులో అడుగు పెడతారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: