రేపే పోలింగ్.. ఓటేసేటప్పుడు ఇలా చేస్తే జైలుకే?

praveen
ఎన్నో రోజులుగా తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల వేడి కొనసాగుతూనే ఉంది. ఏపీలో పార్లమెంట్ ఎన్నికల తో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనుండగా.. ఇక అన్ని పార్టీలు గెలుపే లక్ష్యం గా ప్రచార రంగంలో దూసుకు పోయాయ్.ఇక తెలంగాణ లో పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యం లో గెలుపు కోసం అన్ని పార్టీలు సర్వశక్తులు ఒడ్డాయ్. ఇటీవలే ఎలక్షన్ కమిషన్ విధించిన డెడ్లైన్ తో ప్రచారం మూగబోయింది. ఇక రేపు పోలింగ్ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే.

 ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకునేలా అటు ఎన్నికల అధికారులు ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా ఓటు హక్కు యొక్క ఆవశ్యకతను తెలియజేస్తూ.. ఇక సోషల్ మీడియాలో ఎన్నో పోస్టులు కూడా పెడుతున్నారు అన్న విషయం తెలిసిందే  ఓటును సరిగ్గా వినియోగించుకుని సరైన నాయకుడికి ఎన్నుకోవాలని సూచిస్తున్నారు. అయితే ఇక నిన్నటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా కూడా 144 సెక్షన్ అమల్లో ఉంది అన్న విషయం తెలిసిందే.

 అయితే ఓటు వేయడానికి వెళ్ళినవాళ్లు అక్కడ ఇలాంటి పొరపాట్లు చేస్తే చివరికి జైలుకు వెళ్లడం ఖాయం అని చెప్పాలి. బూత్ వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. దీంతో అక్కడ ఎలాంటి ప్రచారాలు అల్లర్లు సృష్టించకూడదు. ఎన్నికల అధికారి విధులకు ఆటంకం కలిగించడం.. లేదంటే పరికరాలను ధ్వంసం చేయడం చేయకూడదు. ఓటు వేసేటప్పుడు ఫోటోలు తీయడం.. ఏ పార్టీకి ఓటు వేశారు బయట పెట్టడం కూడా నేరమే. ఇక ఎవరైనా ఓటు వేస్తున్నప్పుడు ఫోటోలు వీడియోలు.. దొంగ ఓట్లు కూడా వేయడం నేరమే. ఒకటి కంటే ఎక్కువ ఓట్లు ఉంటే కేవలం ఒకే ఓటును వినియోగించుకునేందుకు అవకాశం ఉంటుంది. కాదని అత్యుత్సాహం ప్రదర్శిస్తే చివరికి జైలుకు వెళ్లక తప్పదు. అందుకే ఓటు వేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: