ఈరోజు ఓడిందా.. ఇక కోహ్లీ టీమ్ కథ ముగిసినట్లే?
కానీ మొదటి మ్యాచ్ నుంచి వరుస ఓటములు చవిచూస్తూ వచ్చిన ఆర్సిబి జట్టు ఇక ప్లే ఆఫ్ లో అయిన అడుగుపెడుతుందా లేదా అనే విషయంపై అనుమానాలు నెలకొన్నాయ్. ఇప్పటివరకు 12 మ్యాచ్లు ఆడిన బెంగళూరు టీం కేవలం 4 విజయాలు మాత్రమే సాధించింది. పాయింట్ల పట్టికలో చివరి నుంచి మూడో స్థానంలో కొనసాగుతుంది అని చెప్పాలి. అయితే ఇప్పుడు rcb వరుసగా మ్యాచ్లు గెలిచినప్పటికీ ఇతర జట్ల గెలుపు ఓటములపై.. ఆ జట్టు భవితవ్యం ఆధారపడి ఉంది అని చెప్పాలి. కాగా నేడు మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోబోతుంది ఆర్సిబి. ఒక రకంగా నేడు ఐపీఎల్ లో డూ ఆర్ డై మ్యాచ్ ఆడబోతుంది అని చెప్పాలి.
ఇప్పటికే నాలుగు విజయాలతో జోరు మీద ఉన్న ఆర్సిబి హోమ్ గ్రౌండ్ అయినా బెంగళూరు వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ ని ఢీకొంటుంది. ఈ మ్యాచ్ సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. అయితే ఈ మ్యాచ్ రద్దు అయిన లేకపోతే ఆర్సీబీ జట్టు ఓడిపోయిన ఇక ఆ టీం ప్లే ఆఫ్ అసలు గల్లంతు అయిపోతాయి అని చెప్పాలి. అయితే మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగించే సూచనలు ఉండటం.. ఆ జట్టుకు ప్రతికూల అంశంగా మారిపోయింది. నేడు జరగబోయే మ్యాచ్ రద్దు అయితే ఢిల్లీకి ఇంకా ప్లే ఆఫ్ అవకాశాలు మిగిలి ఉంటాయి. దీంతో ఆర్సిబి జట్టు మాత్రం నేడు ఢిల్లీ క్యాపిటల్స్ తో టు ఆర్ డై మ్యాచ్ ఆడబోతుంది అని చెప్పాలి.