ఈ సారి కూడా ఏపీ అసెంబ్లీలో రెడ్ల హ‌వానే.. 24 మంది రెడ్డి ఎమ్మెల్యేలు ప‌క్కా... 50 వ‌ర‌కు ఛాన్స్‌..?

RAMAKRISHNA S.S.
- 24 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో కూట‌మి, వైసీపీ నుంచి రెడ్లే పోటీ
- 5 పార్ల‌మెంటు సీట్ల‌లోనూ రెడ్డి నేత‌ల మ‌ధ్యే వార్‌
- వైసీపీ నుంచి ఏకంగా 56 మంది రెడ్లు పోటీ
( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ )
ఏపీలో 2019 ఎన్నిక‌ల్లో వైసీపీ నుంచి ఏకంగా 50 మంది రెడ్డి ఎమ్మెల్యేలు గెలిచి ఓ రికార్డు క్రియేట్ చేశారు. జ‌గ‌న్ సీట్లు ఇచ్చిన 51 మంది రెడ్డి ఎమ్మెల్యేల్లో ఉర‌వ‌కొండ‌లో ప‌య్యావుల కేశ‌వ్ మాత్ర‌మే ఓడిపోయారు. మిగిలిన ఎంపీలు, ఎమ్మెల్యేలు అంద‌రూ గెలిచారు. అదే టైంలో టీడీపీ సీట్లు ఇచ్చిన ఒక్క రెడ్డి నేత కూడా గెల‌వ‌లేదు. ఇక ఈ సారి కూడా అటు జ‌గ‌న్ మ‌ళ్లీ ఎక్కువ మంది రెడ్ల‌కు సీట్లు ఇవ్వ‌గా... ఇటు కూట‌మి కూడా గ‌తంలో కంటే ఎక్కువ మంది రెడ్డి నేత‌ల‌కే సీట్లు ఇచ్చిన ప‌రిస్థితి ఉంది.
24 నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇటు కూట‌మి, అటు వైసీపీ నుంచి రెడ్డి వ‌ర్గం నేత‌లే పోటీ ప‌డుతున్నారు. అంటే ఈ సారి అసెంబ్లీలో ఖ‌చ్చితంగా 24 మంది రెడ్డి ఎమ్మెల్యేలు ఉంటారు. ఇది గ‌రిష్టంగా 50కు వెళ్లినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదు. ఇక పార్ల‌మెంటులో కూడా ఐదుగురు రెడ్డి ఎంపీలు ఈ సారి లోక్‌స‌భ‌కు ఎంపిక కానున్నారు. ఈ 5 స్థానాల్లోనూ రెండు వైపులా రెడ్డి నేత‌లే పోటీలో ఉండ‌నున్నారు.
కూట‌మి, అటు వైసీపీ రెండు వైపులా రెడ్లే పోటీ చేస్తోన్న నియోజ‌క‌వ‌ర్గాల లిస్ట్ ఇదే....
1) తాడిప‌త్రి: జేసీ అశ్మిత్ రెడ్డి ( టీడీపీ ) - కేతిరెడ్డి పెద్దారెడ్డి ( వైసీపీ )
2) పుంగ‌నూరు: చ‌ల్లా రామ‌చంద్రారెడ్డి ( టీడీపీ) - పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి ( వైసీపీ )
3) అన‌ప‌ర్తి: న‌ల్ల‌మిల్లి రామ‌కృష్ణా రెడ్డి ( బీజేపీ)- స‌త్తి సూర్య‌నారాయ‌ణ రెడ్డి ( వైసీపీ )
4) పులివెందుల: బీటెక్ ర‌వి ( టీడీపీ ) - వైఎస్‌. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ( వైసీపీ )
5) క‌మ‌లాపురం: పుత్తా చైత‌న్య రెడ్డి ( టీడీపీ ) - పి. ర‌వీంద్ర‌నాథ్ రెడ్డి ( వైసీపీ )
6) జ‌మ్మ‌ల‌మ‌డుగు : ఆదినారాయ‌ణ రెడ్డి ( బీజేపీ ) - ఎం. సుధీర్ రెడ్డి ( వైసీపీ )
7) ప్రొద్దుటూరు : వ‌ర‌ద‌రాజుల రెడ్డి ( టీడీపీ ) - రాచ‌మ‌ల్లు శివ‌ప్ర‌సాద్ రెడ్డి ( వైసీపీ )

8) పాణ్యం : గౌరు చ‌రితారెడ్డి ( టీడీపీ ) - కాట‌సాని రామ్‌భూపాల్ రెడ్డి ( వైసీపీ )
9) మంత్రాల‌యం : రాఘ‌వేంద్ర‌రెడ్డి ( టీడీపీ ) - వై. బాల‌నాగిరెడ్డి ( వైసీపీ)
10) గిద్ద‌లూరు : ముత్త‌ముల అశోక్ రెడ్డి ( టీడీపీ) - కుందూరు నాగార్జున రెడ్డి ( వైసీపీ)
11) కావ‌లి:  కావ్య కృష్ణారెడ్డి ( టీడీపీ) - రామిరెడ్డి ప్ర‌తాప్‌కుమ‌ర్ రెడ్డి ( వైసీపీ)
12) ఆత్మ‌కూరు: ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి ( టీడీపీ) - మేక‌పాటి విక్ర‌మ్ రెడ్డి ( వైసీపీ)
13) కోవూరు:  వేమిరెడ్డి ప్ర‌శాంతి రెడ్డి ( టీడీపీ) - న‌ల్ల‌పురెడ్డి ప్ర‌స‌న్న‌కుమార్ రెడ్డి ( వైసీపీ)
14) నెల్లూరు రూర‌ల్‌:  కోటంరెడ్డి శ్రీథ‌ర్ రెడ్డి ( టీడీపీ) - ఆదాల ప్ర‌భాక‌ర్ రెడ్డి ( వైసీపీ)
15) స‌ర్వేప‌ల్లి:  సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి ( టీడీపీ) - కాకాణి గోవ‌ర్థ‌న్ రెడ్డి ( వైసీపీ)
16) మాచ‌ర్ల‌:  జూల‌కంటి బ్ర‌హ్మారెడ్డి ( టీడీపీ) - పిన్మెల్లి రామ‌కృష్ణా రెడ్డి ( వైసీపీ)

17) ఆళ్ల‌గ‌డ్డ‌:  భూమా అఖిల‌ప్రియ రెడ్డి ( టీడీపీ) - గంగుల బ్రిజేంద‌ర్ రెడ్డి ( వైసీపీ)
18) శ్రీశైలం: బుడ్డా రాజ‌శేఖ‌ర్ రెడ్డి ( టీడీపీ) - శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి ( వైసీపీ)
19) డోన్‌:  కోట్ల సూర్య‌ప్ర‌కాష్ రెడ్డి ( టీడీపీ) - బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డి ( వైసీపీ)
20) పుట్ట‌ప‌ర్తి: ప‌ల్లె సింధూర రెడ్డి ( టీడీపీ) - దుద్దుకుంట శ్రీథ‌ర్ రెడ్డి ( వైసీపీ)
21) రాయ‌చోటి:  మండిప‌ల్లి రాంప్ర‌సాద్ రెడ్డి ( టీడీపీ) - గ‌డికోట శ్రీకాంత్ రెడ్డి ( వైసీపీ)
22) తంబ‌ళ్ల‌ప‌ల్లి: జ‌య‌చంద్రారెడ్డి ( టీడీపీ) - పెద్దిరెడ్డి ద్వార‌కానాథ్ రెడ్డి ( వైసీపీ)
23) పీలేరు: న‌ల్లారి కిషోర్‌కుమార్ రెడ్డి ( టీడీపీ) - చింత‌ల రామ‌చంద్రారెడ్డి ( వైసీపీ)
24) శ్రీకాళ‌హ‌స్తి: బొజ్జ‌ల సుధీర్ రెడ్డి ( టీడీపీ) - బియ్య‌పు మ‌ధుసూద‌న్ రెడ్డి ( వైసీపీ)

పార్ల‌మెంటు సీట్ల‌లో రెండు వైపులా పోటీ చేస్తోన్న రెడ్డి నేత‌ల వివ‌రాలు:
1) నంద్యాల‌: బైరెడ్డి శ‌బ‌రి ( టీడీపీ) - పోచా బ్ర‌హ్మానంద‌రెడ్డి ( వైసీపీ)
2) రాజంపేట‌: న‌ల్లారి కిర‌ణ్‌కుమార్ రెడ్డి ( బీజేపీ) - పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ( వైసీపీ)
3) క‌డ‌ప‌: భూపేష్ రెడ్డి ( టీడీపీ) - వైఎస్‌. అవినాష్ రెడ్డి ( వైసీపీ)
4) ఒంగోలు: మాగుంట శ్రీనివాసుల‌రెడ్డి ( టీడీపీ) - చెవిరెడ్డి భాస్క‌ర్ రెడ్డి ( వైసీపీ)
5) నెల్లూరు: వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్ రెడ్డి ( టీడీపీ) - వేణుంబాక విజ‌య్‌సాయిరెడ్డి ( వైసీపీ)

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: