ఏపీలో గెలిచేది ఈపార్టీనే.. తేల్చిచెప్పేసిన ప్రొఫెసర్‌ కె.నాగేశ్వర్‌?

Chakravarthi Kalyan
ఏపీలో ఎన్నికలకు సస్పెన్స్ థ్రిల్లర్ గా మారాయి. గెలుపు ఓటములపై పార్టీల్లో ఉత్కంఠ నెలకొంది. హామీలు ఎవరికీ వారు గుప్పిస్తున్నారు. అన్నీ ఉచితాలే. జగన్ కంటే నేను తక్కువ తినలేదు అనే తరహాలో చంద్రబాబు ఉచితాల చిట్టా రోజురోజుకి పెరిగిపోతుంది. ప్రచారాలో పోటాపోటీగా సాగుతున్నాయి. ఎవరికీ వారు తాము గెలుస్తామంటే.. తామే గెలుస్తామనే ధీమాలో ఉన్నారు.

ఇంతకీ ఈ రాష్ట్రంలో ప్రజలు ఏ పార్టీ వైపు ఉన్నారు అనేది ప్రస్తుతం సస్పెన్స్ గానే ఉంది. మొత్తానికి తామే గెలుస్తామనే ఊహల పల్లకిలో ఆయా పార్టీలు ఉన్నాయి. అధికార పక్షానికి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారాన్ని ఆసరాగా తీసుకున్న ప్రతిపక్షం తప్పకుండా తమ గెలుపు ఖాయమనే ధీమాలో ఉంది. ఇక వైసీపీ విషయానికొస్తే ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన వారు తమకే ఓటు వేస్తారని.. ఆ ఓట్లతో తాము సునాయసంగా విజయం సాధించవచ్చని భావిస్తుంది.

అయితే రానున్న ఎన్నికలు గతం మాదిరిగా వన్ సైడ్ గా ఉండవని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే పలు సర్వేలు ఈ విషయాన్ని స్పష్టం చేశాయి. తాజాగా ప్రొఫెసర్, రాజకీయ విశ్లేషకులు నాగేశ్వర్ తాను యూట్యూబ్ ద్వారా చేసిన సర్వే ఫలితాలను వెల్లడించారు. ఇందులో 48 శాతం వైసీపీకి అండగా ఉంటే.. 47 శాతం టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పారు. 3శాతం మంది కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్నారు. మరో రెండు శాతం మంది తాము చెప్పలేం అన్నారు.

అంటే దీనిని బట్టి చూస్తే ఏపీలో పోరు ఎంత హోరాహెరీగా సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. ఈ అభిప్రాయాలు అటు ఇటూ మారినా అది వాటి మధ్య తేడా ఒక్కటి, రెండు శాతంగానే ఉంది. అంటే ఈ సారి పోరు నువ్వానేనా అన్నట్లుగానే సాగుతుందని అంచనా వేశారు. గెలుపు అంత సునాయసంగా దక్కే అవకాశం లేదని.. తన సర్వేలో మాత్రం వైసీపీకి కేవలం ఒక్కశాతం మొగ్గు వచ్చిందని తేల్చి చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: