ఉత్తరాంధ్ర: అక్కడ వణుకుతున్న వైసీపీ, టీడీపీ?

Purushottham Vinay
ఉత్తరాంధ్ర: అనకాపల్లి జిల్లా మాడుగులలో వైసీపీ టీడీపీలకు రెబెల్స్ బెడద తప్పేట్లు లేదని తెలుస్తుంది. రెండు సార్లు ఇక్కడ వరసగా గెలిచి సత్తా చాటిన వైసీపీ ఈసారి హ్యాట్రిక్ విజయం కోసం ప్రయత్నాలు చేస్తుంది.ఉప ముఖ్యమంత్రి అయిన బూడి ముత్యాలనాయుడు ఈసారి అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు. దాంతో మాడుగులలో ఆయన కుమార్తె ఈర్లె అనూరాధకు టికెట్ ని పార్టీ ఇవ్వడం జరిగింది.అయితే ప్రస్తుతం బూడి ఫ్యామిలీ లోనే చిచ్చు రేగింది. ఎందుకంటే బూడి కుమారుడు రవి రెబెల్ గా పోటీ చేసేందుకు రెడీ అయ్యారు. ఆయన తాజాగా మాడుగుల అసెంబ్లీకి నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఆయన తన తండ్రి వదిలేసిన మాడుగుల సీటు తనకే ఇవ్వాలని ఎంతగానో పట్టు పడుతున్నారు. అలాగే తాను గతంలో కూడా ఒకసారి త్యాగం చేశానని గుర్తు చేస్తున్నారు.ఇక స్థానిక ఎన్నికల సందర్భంగా కె కోటపాడు జెడ్పీటీసీకి తాను పోటీ చేస్తానని చెప్పినా కూడా ఈర్లె అనూరాధ కోసం తనను ఒప్పించి పక్కన పెట్టారని అంటున్నారు. అయితే ఇప్పుడు ఏకంగా ఎమ్మెల్యే టికెట్ కూడా ఆమెకే ఇచ్చారని ఆయన మండిపోతున్నారు. అందుకే తాను పోటీ అని అంటున్నారు. ఇక దీని కంటే ముందు ఆయన టీడీపీలో చేరేందుకు కూడా ప్రయత్నం చేశారు.


కానీ ఆ పార్టీ మాత్రం దగ్గరకు తీయలేదు. అయితే ఇవన్నీ పక్కన పెడితే బూడికి ఈ విధంగా సన్ స్ట్రోక్ తగిలిందని అంటున్నారు.ఇక మాడుగులలో మంచి మెజారిటీ అనేది వస్తే అది ఎంపీ ఎన్నికల్లో బూడికి కలసి వస్తుందని భావిస్తున్నారు. కానీ చూస్తుంటే మాడుగులలో అన్నా చెల్లెళ్ళ మధ్య పోటీ సాగేలా కనిపిస్తోంది. ఈ నెల 29వ తేదీలోగా రవి నామినేషన్ ని విరమించేలా చూస్తేనే వైసీపీకి రిలీఫ్ అని తెలుస్తుంది.ఇక తెలుగుదేశం పరిస్థితి అయితే ఇంతకంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. ఆ పార్టీ నుంచి పలువురు పోటీకి రెడీగా ఉండగా మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తిని తెచ్చి చివరాఖరికి పోటీకి పెట్టారు. దాంతో మొదటి లిస్టులో తన పేరు ఉందని అప్పటి నుంచి ప్రచారం చేసుకుంటూ వస్తున్న ఎన్నారై పైలా ప్రసాదరావు నామినేషన్ తొలి రోజునే వేసేశారు. ఆయన పోటీకి రెడీ అంటున్నారు. ఇంకా అదే విధంగా మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు కూడా నామినేషన్ దాఖలు చేశారని తెలుస్తోంది. ఈ విధంగా వైసీపీ టీడీపీలను రెబెల్స్ దడ పుట్టించేలా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: