పవన్: పిఠాపురంలో కూడా గోవిందా..!

Divya
ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఈనెల 25 వరకే నామినేషన్ల స్వీకరణ గడువు ఉన్నట్లుగా తెలుస్తోంది. దీంతో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఈ రోజున నామినేషన్ వేయడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ సమయంలోనే టిడిపి బిజెపి జనసేన నుంచి పోటీ చేయడం పైన వైసిపి నేత సజ్జల పలు కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పిఠాపురం పైన పోటీ చేయడంపై సందేహాన్ని కూడా వ్యక్తం చేశారు.

అసలు విషయంలోకి వెళితే టిడిపి నేత చంద్రబాబు తమ పార్టీ నేతలను ఇతర పార్టీలోకి పంపించి పక్క ప్లాన్ ప్రకారమే వారిని నిలబెట్టేలా ప్లాన్ చేస్తున్నారంటూ సజ్జల తెలియజేశారు. భీమవరం అవనిగడ్డలో కూడా ఇలాగే జరిగిందని.. ఇప్పుడు అనపర్తి లో కూడా అదే జరగబోతుందని తెలియజేశారు. బిజెపి జనసేనకు సీట్లు ఇచ్చినట్లే ఇచ్చి మరి చంద్రబాబు తమ వారిని పోటీ చేయిస్తున్నారు అంటూ తెలియజేశారు సజ్జల. పవన్ కళ్యాణ్ కు కనీసం రెండేళ్ల అయినా సీఎం పదవి దక్కాలని జననేతలు ,జనసైనికుల కోరిక అంటూ వివరించారు.

అయితే పొత్తులో భాగంగా మొదట జనసేనకు 24 సీట్లు ఇవ్వగా చివరికి 21 సీట్లకే పరిమితం చేశారు.. అందులో కేవలం పదిమందికే పవన్ కళ్యాణ్ తమవారికి టికెట్ ఇప్పించుకున్నారంటూ తెలిపారు. మిగిలిన 12 మంది కూడా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. ఒకవేళ బాబుతో ఒప్పందం కుదిరితే పిఠాపురంలో కూడా పవన్ కళ్యాణ్ పోటీ నుంచి తప్పుకోవచ్చు అంటూ పలు కీలకమైన వ్యాఖ్యలు చేశారు సజ్జల. కేవలం రాష్ట్రం మొత్తం తాను ప్రచారం చేయాలని కారణంతో పవన్ కళ్యాణ్ తప్పుకుంటారేమో అంటూ తెలియజేశారు. చంద్రబాబు ఆలోచన కూడా మొత్తం సీట్లలో తన పట్టు ఉండాలని ఆలోచిస్తున్నట్టుగా కనిపిస్తోంది అంటూ సజ్జల వ్యాఖ్యానించారు. అందుకే పిఠాపురంలో సైతం పవన్ ని తప్పించి వర్మ నీ దింపుతారేమో అనే అనుమానాన్ని కూడా తెలియజేశారు. ఒకవేళ ఇలా జరిగితే ఇక జనసేన నేతలు కార్యకర్తలతో పాటు పవన్ కళ్యాణ్ గోవిందా అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: