బీజేపీ కి పురందరేశ్వరి ప్రమాదంగా మారిందా..?

Pulgam Srinivas
ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ఇంచార్జ్ అయినటువంటి పురందరేశ్వరికి తన పార్టీ నుండే థ్రెడ్ ప్రారంభం అయింది. ఈమెను నమ్మి బీజేపీ పార్టీ ఆంధ్ర ప్రదేశ్ కి సంబంధించిన అన్ని అధికారాలను ఈమెకు ఇస్తే ఈమె మాత్రం పార్టీని ఏ మాత్రం పట్టించుకోవడం లేదు తన సొంత ప్రయోజనాలకే ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తూ వస్తుంది అని పలువురు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఇక్కడ లేని స్థాయిలో దుర్మార్గంగా వనపర్తి సీటు విషయంలో ఈమె ప్రవర్తిస్తుంది అని... పార్టీ అధినాయకత్వం చెప్పిన కూడా ఈమె వినకుండా అభ్యర్థిని మార్చడానికి స్వయంగా కంకణం కట్టుకొని తెలుగుదేశం అభ్యర్థిని తన వెంట పట్టుకొని వెళ్లడంతో ఈమెపై అనేక కామెంట్లు వస్తున్నాయి.

ఇక తాజాగా సోషల్ మీడియాలో ఈమెపై వ్యతిరేకంగా ఓ పోస్టు వైరల్ అవుతుంది. ఆ పోస్ట్ ప్రకారం... పురందరేశ్వరి కోసం మనమంతా ఎందుకు కష్టపడాలి. ఆమె తన కోసం, తన ప్రయోజనాల కోసం మాత్రమే ఆలోచిస్తుంది. ఆమె గెలిచినా కూడా ఏపీలో "బీ జే పీ" నీ ఈమె సంపూర్ణంగా నాశనం చేస్తుంది. ఎంతో నిబద్ధతతో , చిత్తశుద్ధితో పని చేసేటటువంటి శివ కృష్ణం రాజు ని పక్కన పెట్టి "టీ డీ పీ" కి అమ్ముడుపోయే లాంటి పురందరేశ్వరుని గెలిపించి ప్రయోజనం లేదు. "బీ జే పీ" ఎన్నో ఓడిదుడుకులను ఇప్పటి వరకు అడుర్కుంది.

బీ జే పీ పార్టీ అంటేనే కట్టుబాట్లకు కట్టుబడి ఉండేది. అంత కట్టుబాట్లతో ఉండే పార్టీలో పురందరేశ్వరి వల్ల ఆంధ్రప్రదేశ్ లో నష్టం జరుగుతుంది. దాని వల్ల ఈమెను ఓడించి చూపిద్దాం అనే ఒక పోస్ట్ వైరల్ అవుతుంది. ఇకపోతే పురందరేశ్వరి ఈ సారి రాజమండ్రి నుండి పోటీ చేస్తుంది. వనపర్తిలో గనుక ఏమైనా ప్రాబ్లం అయ్యి కాండిడేట్ ఓడిపోతే దాని ఎఫెక్ట్ తనపై కూడా పడుతుంది అనే ఉద్దేశంతోనే ఈమె వనపర్తి సీటు విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: