ఏపీ: భర్తకు రూ.30 కోట్లు అప్పు ఇచ్చానంటున్న షర్మిల.. షాక్ అవుతున్న రాష్ట్ర ప్రజలు..??

Suma Kallamadi

ఏపీలోని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కడప పార్లమెంట్ స్థానంలో పోటీ చేస్తున్నారు. ఇటీవల నామినేషన్ల పర్వం ప్రారంభం కాగా ఆమె తాజాగా కలెక్టరేట్ కార్యాలయంలో అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారికి నామినేషన్ డాక్యుమెంట్స్ సమర్పించింది. తన నామినేషన్ అఫిడవిట్‌లో, షర్మిల తన ఆస్తులు, అప్పులు రెండింటినీ కలిగి ఉన్న తన ఆర్థిక వివరాలను బయట పెట్టింది. అయితే అందులో ఆర్థిక వివరాలు చాలా వింతగా, విచిత్రంగా అనిపించాయి.
అఫిడవిట్‌ ప్రకారం, ఆమె ఆస్తులు మొత్తం రూ.182.82 కోట్లు. ఈ మొత్తంలో స్థిరాస్తుల విలువ రూ.9.29 కోట్లు. చరాస్తులు, నగదు, పెట్టుబడులు, ఇతర వ్యక్తిగత ఆస్తులతో సహా మొత్తం రూ.123.26 కోట్లు ఉన్నాయి. అదనంగా, ఆమె విలువైన బంగారు ఆభరణాలను కలిగి ఉన్నట్లు ప్రకటించింది.
షర్మిల అఫిడవిట్‌లో తనకు అప్పులు కూడా ఉన్నాయని చెప్పింది. ఆమె అన్నయ్య వైఎస్ జగన్ నుంచి రూ.82.58 కోట్లు, ఇంకా, కుటుంబ సభ్యుల నుంచి చిన్న రుణాలు తీసుకుంది, అందులో వైఎస్ భారతి రెడ్డి నుంచి రూ.19.56 లక్షలు, తల్లి వైఎస్ విజయమ్మ నుంచి రూ.40 లక్షలు తీసుకుంది. అలానే భర్త అనిల్ తన దగ్గర రూ.30 కోట్ల అప్పు తీసుకున్నట్లు ఆమె పేర్కొంది. భర్తకు ఆమె అప్పులు ఇవ్వడం ఏంటో, దాని గురించి అఫిడవిట్‌లో తెలియజేయడమేంటో వింతగా అనిపించింది. ప్రజలకు ఆస్తి వివరాలను తెలపాల్సి ఉంటుంది కాబట్టి ఆమె ఈ వివరాలను తెలియజేసిందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.
వీటిలో నిజం ఉండకపోవచ్చు అని రాజకీయ విశ్వేషకులు అంటున్నారు. భర్తకు ముప్పై కోట్లు అప్పు ఆమె ఎందుకు ఇచ్చిందో తెలియాల్సి ఉందని పేర్కొంటున్నారు. ఇకపోతే తనపై ఎనిమిది చట్టపరమైన కేసులు నమోదయ్యాయని అఫిడవిట్‌లో వెల్లడించింది. కడప ఎంపీ స్థానానికి జరగనున్న ఎన్నికల్లో షర్మిల ప్రధాన పోటీదారుగా ఆమె తమ్ముడు వైసీపీ సభ్యుడు, ప్రస్తుత ఎంపీగా ఉన్న వైఎస్ అవినాష్ రెడ్డి నిలబడ్డారు. మరి షర్మిల తమ్ముడు అవినాష్ రెడ్డి పై గెలుపు సాధిస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: