కెసిఆర్..ఈటెల స్నేహం.. పార్టీ స్థాపితం నుండి గెలుపు వరకు..కానీ చివరికి..?

Pulgam Srinivas
రాజకీయంలో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు అని ఇప్పటికే ఎంతోమంది ఎన్నోసార్లు చెప్పుకొచ్చారు. ఇలాంటి స్నేహాలలో కల్వకుంట్ల చంద్రశేఖర రావు, ఈటల రాజేందర్ బంధం కూడా ఒకటి. కెసిఆర్ 2001వ సంవత్సరం ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) పేరుతో పార్టీని స్థాపించాడు. పార్టీ స్థాపించినప్పుడు ఉన్న వ్యక్తులలో ఈటెల రాజేందర్ కూడా ఒకరు. తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడే వ్యక్తుల్లో ఈ పార్టీలో వీరిద్దరూ చాలా కీలకంగా మారారు.

కేసీఆర్ ఏ సూచనలు చేసిన ఆ సూచనలకు మేరకు ఈటెల నడుచుకుంటూ వెళ్లారు. 2004 ఎన్నిక‌ల్లో క‌మ‌లాపూర్ నియోజ‌క‌వ‌ర్గం నుండి పోటిచేసి టీడీపీ అభ్యర్థి ముద్దసాని దామోదర్‌ రెడ్డి పై గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 2008 ఉప ఎన్నికల్లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచాడు. వైఎస్ హయాంలో టీఆర్‌ఎస్ ఎల్పీ నేతగా ఉన్న ఈటల తన వాగ్ధాటితో అందరిని ఆకట్టుకున్నారు. 2009 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా కమలాపూర్‌ నియోజకవర్గం హుజూరాబాద్‌గా మారింది.

ఆయన 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి వకుళాభరణం కృష్ణమోహన్‌ రావు పై, 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో ముద్దసాని దామోదర రెడ్డి పై గెలిచి నాల్గొవసారి ఎమ్మెల్యేగా గెలిచాడు. ఇలా ఈటెల వరుసగా విజయాలను గెలుచుకొని జనాల్లో అద్భుతమైన క్రేజ్ను సంపాదించుకోవడంతో కేసీఆర్ కూడా ఈటలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇతను గొప్ప లీడర్ అనే ఉద్దేశంతో ఆయనను ఎప్పుడూ పక్కన పెట్టుకుంటూ ఈటెలకు పార్టీలో ప్రముఖ ప్రాధాన్యతను ఇస్తూ వచ్చాడు.

అలా కేసీఆర్ తనకు అత్యంత ప్రాధాన్యతను ఇవ్వడంతో ఈటెల కూడా కేసీఆర్ చెప్పిందే చేస్తూ వెళ్ళాడు. దానితో వీరిద్దరి స్నేహం కూడా చాలా ముదిరింది.  ఇక ఎన్నో పోరాటాల తర్వాత 2014వ సంవత్సరంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత జరిగిన మొదటి అసెంబ్లీ ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ ఎక్కువ అసెంబ్లీ స్థానాలలో గెలిచి ప్రభుత్వాన్ని నెలకొల్పింది. దానితో కెసిఆర్ కూడా ఈటెలకు తన మంత్రివర్గంలో అత్యంత ప్రధాన పాత్రను ఇచ్చాడు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈటెల తెలంగాణ రాష్ట్రానికి మొదటి ఆర్థిక మంత్రిగా పనిచేశారు.

ఇక 2019 వ సంవత్సరంలో టిఆర్ఎస్ పార్టీ మరోసారి గెలిచింది. ఆ తర్వాత కూడా ఈటెలకు కేసీఆర్ మంచి ప్రాముఖ్యతను ఇస్తూ వచ్చాడు. కానీ ఆ తర్వాతే అసలు సమస్య వచ్చింది. వీరిద్దరి మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు ఏర్పడడంతో కేసీఆర్, ఈటెలను దూరం పెడుతూ వచ్చాడు. దానితో ఈటెల కూడా ప్రభుత్వంపై ప్రభుత్వ పథకాలపై అలాగే కేసీఆర్ పై ఇన్ డైరెక్ట్ గా సెటైర్లు వేయడం మొదలుపెట్టాడు. ఇది చివరకు పెరిగి ఇటెలా పార్టీ మారేవరకు తీసుకువచ్చింది.

ఈటెల కేసీఆర్ తో గొడవల అనంతరం టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఆ పార్టీ పేరుతో గెలిచిన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి బీజేపీ నుండి హుజరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేశారు. ఇందులో కూడా ఆయన గెలిచారు. పోయిన సంవత్సరం జరిగిన  శాసనసభ ఎన్నికల్లో ఈటెల రాజేందర్ హుజురాబాద్ నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి చేతిలో 16873 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.

అలా టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుండి గెలుపు వరకు ఆ తర్వాత కూడా చాలా కాలం పాటు ఎంతో స్నేహబంధంతో మెలిగిన కేసీఆర్, ఈటెల చిన్నచిన్న మనస్పర్ధల వల్ల దూరం అయ్యారు. ఇక ఇప్పటికే కూడా వీరు అసెంబ్లీలో ఒకరిని ఒకరు ప్రత్యక్షంగా భారీగా దూషించకుండా కాస్త హుందా గానే మేలుచుకుంటూ వస్తున్నారు. కానీ ఏమైనాప్పటికీ తెలంగాణ రాజకీయ చరిత్రలో వీరి స్నేహబంధం ఎంతో కాలం పాటు చాలా బాగా సాగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: