సీబీఎన్ బర్త్ డే:సంక్షోభాలను సైతం శాసించే నాయకుడు.!!

Pandrala Sravanthi
చంద్రబాబు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో సంచలనాలు సృష్టించినటువంటి గొప్ప రాజకీయ నాయకుడు. చిత్తూరు జిల్లా నారావారి పల్లెలో  1950 ఏప్రిల్ 20న జన్మించిన ఈయన   ఓపిక, సహనం, పట్టుదల,  అంకిత భావం అనే పదాలను తన రాజకీయ ఆస్త్రాలుగా వాడుకొని తనదైన శైలిలో టిడిపి పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి 1995 సెప్టెంబర్ 1న ముఖ్యమంత్రి పదవి బాధ్యతలు చేపట్టారు.ఇక అప్పటి నుంచి నిరంతరం ప్రజల్లోనే ప్రజలతోనే ఉంటూ ప్రజా నాయకుడిగా పేరు సంపాదించుకున్నారు. అలాంటి చంద్రబాబు రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి దాదాపుగా 50 సంవత్సరాలు దాటింది.  ప్రస్తుత ఆయన ఏజ్ 74 సంవత్సరాలు పూర్తి చేసుకుని 75వ సంవత్సరంలోకి అడుగుపెడుతోంది. 

 అలాంటి చంద్రబాబు తన రాజకీయ జీవితంలో ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నారు, ప్రజలను ఏ విధంగా సంక్షోభాల నుంచి కాపాడారు అనే వివరాలు చూద్దాం.. అన్నీ ఉన్నప్పుడు పాలన చేయడం ఎవరికైనా సాధ్యమే. కానీ సంక్షోభంలో కూడా  ప్రజలను కాపాడిన వాడే గొప్ప రాజకీయ నాయకుడు అవుతారు. అలాంటి వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది నారా చంద్రబాబునే. ఇప్పటికి తెలుగు రాష్ట్రం ఎన్నోసార్లు సంక్షోభాల  బారిన పడింది. కానీ ప్రజలకు ఎలాంటి కష్టాలు రాకుండా సంక్షోభాల నుంచి కూడా అవకాశాలు వెతికి  ప్రజా శ్రేయస్సు కోసం పాటుపడిన  అధినాయకుడు చంద్రబాబు అని చెప్పవచ్చు.  ప్రస్తుతం హైదరాబాదులో ఐటి అంతగా డెవలప్ అయి ఎంతో మంది జాబ్స్ చేస్తున్నారంటే ప్రధాన కారకుడు  చంద్రబాబు.  

ఆయన రాజకీయం భవిష్యత్తు తరాలకు ఎంతో ఉపయోగపడే విధంగా ఉంటుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.  అలాంటి చంద్రబాబును అరుదైన రాజకీయ లక్షణాలు కలిగిన వ్యక్తిగా మాజీ ప్రధానమంత్రి వాజ్పేయి కూడా కొనియాడారు. అంతేకాకుండా  ఆర్థిక సామాజిక రంగాల్లో అభ్యుదయ సమాజ మార్పు కోసం పాటుపడిన నేతల్లో  చంద్రబాబు కూడా ఒకరిని  వరల్డ్ ఎకనామి ఫోరం గుర్తించింది. వరల్డ్ డ్రీమ్ కేబినెట్ కు మొత్తం ప్రపంచవ్యాప్తంగా 14 మందిని ఎంపిక చేసింది. ఇందులో చంద్రబాబుకు స్థానం  లభించడం తెలుగు రాష్ట్రాలలో ఒక ఘనత అని చెప్పవచ్చు. ఇలాంటి చంద్రబాబు టిడిపి పార్టీని అంచలంచలుగా విస్తరించారు.  తన మామ ఎన్టీఆర్ వేసిన విత్తనాన్ని మహావృక్షంగా మార్చి ఎంతో మందికి నీడని ఇస్తున్నాడు. అలుపెరుగని శ్రమతో  ఏడుపదుల వయస్సులో కూడా ప్రజా శ్రేయస్సు కోసం మరోసారి ఎన్నికల బరిలో నిలవబోతున్నారు. తనని ఎలాగైనా గెలిపించాలని ప్రజలను వేడుకుంటూ ముందుకు వెళ్తున్న చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: