షర్మిల: చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు..!

Divya
ఏపీలోని ఎన్నికల సమరం హోరా హోరిగా రోజురోజుకి కొనసాగుతూనే ఉంది.. ఈసారి ఎన్నికలు కూటమి వర్సెస్ వైసీపీ మధ్య అన్నట్టుగా కొనసాగుతున్నాయి.. అయితే అనుకోని విధంగా షర్మిల కాంగ్రెస్ పార్టీని ఆంధ్రలో మళ్లీ పైకి లేపాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉంది. పీసీసీ చీఫ్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి చాలా యాక్టివ్ గా ఉన్నది షర్మిల. ఈసారి ఎన్నికలలో కూడా ఈమె పాత్ర కాస్త కీలకంగా మారబోతోందని చెప్పవచ్చు. ఇప్పటివరకు ఎక్కువగా జగన్ మీదే ఫోకస్ పెట్టింది షర్మిల. ఇప్పుడు తాజాగా చంద్రబాబు పైన గురిపెట్టినట్టుగా తెలుస్తోంది.

ఇటీ వలె రాయలసీమలోని అనంతపూర్ జిల్లా మడకశిర నియోజకవర్గం లో ఎన్నికల ప్రచారంలో భాగంగా షర్మిల పాల్గొనగా అక్కడ చంద్రబాబు, జగన్ లను ఏకిపారేసింది. షర్మిల మాటలు అక్కడి ప్రజలకు కాస్త ఊపునిచ్చేలా కనిపిస్తున్నాయి. కడప ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి షర్మిల వివేకా హత్య కేసును ప్రస్తావిస్తూనే పలు రకాల ఆరోపణలు వైసిపి ఎంపీ అభ్యర్థి అవినాష్ పైన చేస్తూనే ఉంది. ముఖ్యంగా వైసిపి నేత జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి ప్రాజెక్టులు కూడా రాలేదని విమర్శించారు. గత పదేళ్లుగా  ఈ నియోజకవర్గాలను టిడిపి వైసిపి మోసం చేస్తున్నారని వెల్లడించింది షర్మిల.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఒక సంజీవని వంటిది హోదా వచ్చి ఉంటే ఎన్నో వేల పరిశ్రమలు వచ్చేవి హోదా విషయంలో బిజెపి పార్టీ మోసం చేసిందంటూ షర్మిల విమర్శించింది. అలాగే బాబు జగన్ ఇద్దరు కూడా బిజెపితో  పోత్తులు పెట్టుకున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. చంద్రబాబు జగన్ ఇద్దరు కూడా బిజెపి కి గులాం అయ్యారు అంటూ షర్మిల ఫైర్ అయ్యింది. ఆంధ్రాలో ఒక్క సీటు లేని కూడా బిజెపి ఏపీలో రాజ్యమేలుతోందంటూ.. జగన్, చంద్రబాబు కి ఓటు వేసిన బిజెపికి వేసినట్టే అంటూ షర్మిల వెల్లడించింది. రాష్ట్ర ప్రయోజనాలను సైతం తాకట్టుపెట్టి మరి జగన్ ,చంద్రబాబు ఇద్దరూ కూడా ఈ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు.. ఈ రాష్ట్రానికి వీరు అవసరమా అంటూ షర్మిల నిలదీస్తోంది.

అయితే ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మొదటి సంతకం 2.25 లక్షల ఉద్యోగాలు భర్తీయంటూ ఎడాదికి మహిళలకు లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అంటూ.. వృద్ధులకు 4000 ఫించిని...వికలాంగులకు 6000 అందిస్తామంటూ తెలిపింది షర్మిల. ప్రస్తుతం బాబు ,జగన్ పైన షర్మిల చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: