విశాఖ: టీడీపీ గెలిస్తే వారికి అగ్ర తాంబూలం ఉంటుందా?

Purushottham Vinay
ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికలు చాలా తొందరగా సమీపిస్తున్న సంగతి తెలిసిందే.తెలుగు దేశం పార్టీ గెలిస్తే చాలు మంత్రులుగా ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు మంత్రులుగా రెడీగా ఉంటారని అంటారు.వీరు ఇద్దరూ సీనియర్ నేతలే కాదు, చంద్రబాబుకు అత్యంత సన్నిహితులు కూడా. దాంతో పాటు వీరు రెండు బలమైన సామాజిక వర్గానికి చెందిన వారు.అందుకే వీరికి విశాఖ జిల్లాలో అగ్ర తాంబూలం అనేది దక్కుతోంది.చంద్రబాబు 2014 వ సంవత్సరంలో గెలిస్తే గంటా అయ్యన్నలను ఇద్దరినీ కూడా మంత్రులుగా చేశారు. ఏకంగా అయిదేళ్ల పాటు వారే కొనసాగారు. ఇక 2024లో తెలుగుదేశం మరోసారి గెలిస్తే వీరికి ఎంతవరకూ అవకాశం ఉంది అన్న చర్చ అపుడే మొదలైంది.ఎందుకంటే ఈసారి టీడీపీ కూటమిలో జనసేన బీజేపీ కూడా ఉన్నాయి. విశాఖ వరకూ చూస్తే బీజేపీతో ఇబ్బంది లేదు కానీ జనసేన నుంచి మంత్రి పదవులకు పోటీ ఖాయమని తెలుస్తుంది.


ఇక విశాఖ సౌత్ నుంచి జనసేన తరఫున పోటీ చేస్తున వంశీ క్రిష్ణ శ్రీనివాస్ యాదవ్, అలాగే పెందుర్తి నుంచి పోటీలో ఉన్న పంచకర్ల రమేష్ బాబు ఇంకా అనకాపల్లి నుంచి పోటీ చేస్తున్న మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ ఈ ముగ్గురూ కూడా క్యాబినెట్ బెర్తులకు ప్రధాన పోటీదారులు అని అంటున్నారు. వీరిలో ఒకరికి మంత్రి పదవి ఇవ్వడం ఖాయమని అంటున్నారు.ఇక రెండవ పదవి తెలుగుదేశం పార్టీ వారికే ఇస్తారు. అయితే ఈసారి కొత్త ముఖాలకే ఇవ్వాలని చంద్ర బాబు చూస్తున్నారు. పైగా అయ్యన్నకు ఇచ్చి గంటాకు ఇవ్వకపోయినా బాగోదు. అలాగే ఈయనకు ఇచ్చి ఆయనను పక్కన పెట్టినా కూడా బాగోదు.అందుకే ఈ ఇద్దరూ గెలిచినా కూడా సీనియర్ ఎమ్మెల్యేలుగానే ఉంటారని అంటున్నారు. తెలుగు దేశం పార్టీ నుంచి కొత్త వారితో పాటు జనసేనకు ఒక బెర్త్ ఖాయమని అపుడే ప్రచారం స్టార్ట్ అయిపోయింది. దాంతో ఈ ఇద్దరు సీనియర్లకు మినిస్టర్ పోస్టు నిజంగా అందని పండేనా లేక ఏమైనా అనుకోని పరిణామాలు సంభవిస్తాయా అన్నది చూడాలని అంటున్నారు. మరి చూడాలి మరి తెలుగు దేశం పార్టీ గెలిస్తే వీరికి బెర్తులు కన్ఫర్మ్ అవుతాయో లేదో..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: