నాలుగు సార్లు గెలిచిన ఆ వైసీపీ రెడ్డిని టీడీపీ రెడ్డి ఓడిస్తాడా.. జిల్లాలో ఏకైక సీటు ఇదే..?

RAMAKRISHNA S.S.
* మాచ‌ర్ల‌లో ఆస‌క్తిగా మారిన రెడ్ల స‌మ‌రం
* ఐదోసారి పోటీలో పీఆర్కే... గ‌ట్టి పోటీతో స‌వాల్ విసురుతోన్న బ్ర‌హ్మారెడ్డి
* జిల్లాలో రెడ్డి నేత‌ల స‌మ‌రం జ‌రుగుతోన్న ఏకైక సీటు ఇదే..!
( ప‌ల్నాడు - ఇండియా హెరాల్డ్ )
గుంటూరు జిల్లాలోని రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలు.. ప్రధాన పక్షాల నుంచి పోటీపడే ఏకైక నియోజకవర్గంగా మాచర్ల నిలవనుంది. 2019 ఎన్నికలలోను జిల్లాలో రెండు ప్రధాన పార్టీల నుంచి రెడ్లు పోటీపడిన ఏకైక నియోజకవర్గం మాచర్ల. 2014లో మాత్రం గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి కూడా టిడిపి తరఫున మోదుగుల వేణుగోపాల్ రెడ్డి.. వైసీపీ నుంచి లేళ్ల అప్పిరెడ్డి పోటీపడ్డారు. ఇప్పుడు జిల్లాలో టీడీపీ రెడ్డి సమావేశ వర్గానికి కేటాయించిన ఏకైక సీటు మాచర్ల మాత్రమే. మాచర్ల సీటు గత కొన్ని దశాబ్దాలుగా రెడ్డి సామాజిక వర్గానికి సాంప్రదాయ సీటుగా ఉంటుంది.

1994 నుంచి 2019 వరకు ఇక్కడ ఏ పార్టీ నుంచి అయినా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నారు. చివరిసారిగా ఇక్కడ తెలుగుదేశం 1999లో మాత్రమే గెలిచింది. ఆ ఎన్నికలలో తెలుగుదేశం నుంచి పోటీ చేసిన జూలకంటి దుర్గాంబ.. పిన్నెల్లి లక్ష్మారెడ్డిపై విజయం సాధించారు. ఇక 2004 నుంచి మాచర్ల నియోజకవర్గం.. రెడ్డి సామాజిక వర్గానికి.. అందులో కాంగ్రెస్ ఆ తర్వాత వైసీపీకి అడ్డాగా మారిపోయింది. 2004లో ఇక్కడి నుంచి పిన్మెల్లి లక్ష్మారెడ్డి, జూలకంటి బ్రహ్మారెడ్డిపై విజయం సాధించారు. ఇక 2009లో లక్ష్మారెడ్డి వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.. మరోసారి బ్రహ్మారెడ్డిని ఓడించారు.

అనంతరం వైసీపీలోకి వెళ్లిన రామకృష్ణారెడ్డి 2012 ఉప ఎన్నికలతో పాటు.. 2014, 2019 సాధారణ ఎన్నికలలో విజయం సాధించారు. 2009 నుంచి ప్రతి ఎన్నికకు అభ్యర్థిని మారుస్తూ వస్తున్న తెలుగుదేశం.. ఈ ఎన్నికలలో మరోసారి బ్రహ్మారెడ్డిని బరిలోకి దింపింది. 2004, 2009 ఎన్నికలలో వరుసగా ఓడిపోయిన బ్రహ్మారెడ్డి.. ఆర్థికంగా బాగా వీక్ గా ఉన్నారు. అయితే ఆయనపై మంచి సానుభూతి ఉంది. ఈసారి మాచర్లలో హోరా హోరీపోరు అయితే కనిపిస్తోంది. మరి ఇద్దరు రెడ్డి సామాజిక వర్గం నేతలలో.. పిఆర్కే ఐదోసారి గెలుస్తారా..? లేదా ఆయన రికార్డు బ్రేక్ చేసి బ్రహ్మారెడ్డి అసెంబ్లీలో అడుగు పెడతారా..? అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: