కేరళ: బీజీపీ బోణీ కొట్టే సీటు అదేనా.. ఆయనపైనే ఆశలు?

గాడ్స్ ఓన్‌ కంట్రీగా కేరళని పిలుస్తుంటారు. కానీ దేవుడిని ఆధారంగా చేసుకొని ఇక్కడి ప్రజలు ఓటు వేయరు. గత ఎన్నికల్లో బీజేపీ గాడ్ ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయాలని చూసి విఫలం అయింది. మొత్తం మీద బీజేపీకి కొరకరాని కొయ్యగా మారింది. కేరళ రాజకీయాల్లో ఎల్డీఎఫ్, యూడీఎఫ్ కూటములదే హవా. బీజేపీకి క్యాడర్ ఉన్నా ఆదరణ అంతంతే.

దక్షిణాదిలో బీజేపీ ఇంత వరకు ఒక్క లోక్ సభ స్థానం కూడా గెలవని రాష్ట్రం ఏదైనా ఉందంటే.. అది కేరళ మాత్రమే. అయినా 2019 లోక్ సభ ఎన్నికల్లో పార్టీ ఇక్కడ 13 శాతం ఓట్లు సాధించింది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం 11.3 శాతానికే పరిమితం అయింది. ఈ సారి రాష్ట్రంలో ఎలాగైనా బోణీ కొట్టాలని ఉవ్విళూరుతుంది. ఎలాగైనా పాగా వేయడమే లక్ష్యంగా పావులు కదుపుతుంది.

క్రిష్టియన్,  మైనార్టీ ఓటర్లకు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తోంది. ఫలితంగా పలు రాష్ట్రాల్లో పోటీ త్రిముఖంగా మారింది. అయితే కేరళలో గెలిచేందుకు ఆ పార్టీ కొత్త వ్యూహాలు పన్నుతోంది. ఇక్కడ గెలిచే అవకాశం ఉన్న ఏకైక సీటు త్రిసూర్ మాత్రమే. రాజకీయ నేతగా మారిన ప్రముఖ నటుడు సురేశ్ గోపి ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా నిలిచారు. 2019లోక్ సభ ఎన్నికల్లో ఆయన ఇక్కడి నుంచే పోటీ చేసి మూడో స్థానంలో నిలిచారు. కాంగ్రెస్ అభ్యర్థి టీఎన్ ప్రతాపన్ విజయం సాధించారు.

అయితే ప్రచారం మొదలయ్యాక ఆలస్యంగా గోపి అభ్యర్థిత్వాన్ని బీజేపీ అధిష్ఠానం ఖరారు చేసింది.  కానీ 30లక్షల ఓట్లు వరకు సాధించగలిగారు. ఈసారి ముందుగా టికెట్ ప్రకటించడం.. ఆయన కుమారుడి పెళ్లికి ప్రధాని మోదీ హాజరు కావడం వంటి రాజకీయ కారణాలతో ఈయన బలపడ్డారని బీజేపీ భావిస్తోంది. అందుకే ఈ సీటుపై ఆ పార్టీ బలంగా ఆశలు పెట్టుకుంది. ఒకవేళ బోణీ కొడితే మాత్రం కాస్తో కూస్తో అవకాశాలు ఉంది మాత్రం త్రిసూర్ లోనే. ఇక తిరువనంతపురంలో కాంగ్రెస్ నుంచి శశి ధరూర్ పోటీలో ఉండగా.. బీజేపీ కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ని బరిలో దింపింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp

సంబంధిత వార్తలు: