ఈ ఎన్నికల్లో మోడీని బాగా ఇబ్బంది పెడుతున్న అంశమిదే?

Chakravarthi Kalyan
గత నెలలో ఎన్నికల బాండ్లపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దానిని రద్దు చేయాలని కోరింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు తలంటింది. సుప్రీం కోర్టు అక్షింతల వేసిన నేపథ్యంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దిగి వచ్చింది. ఎవరెవరు ఎన్నికల బాండ్లు కొనుగోలు చేశారు? ఏ కంపెనీలు ఏ పార్టీలకు ఏ స్థాయిలో ఇచ్చారో వివరాలు చెప్పింది.

ఇందులో అధికార బీజేపీ నుంచి మొదలు పెడితే ప్రతిపక్ష కాంగ్రెస్ వరకు అన్నీ ఉన్నాయి. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఎక్కువ మొత్తంలో బాండ్ల రూపంలో నిధులు రావడం తో కలకలం నెలకొంది. ప్రధాన ప్రతిపక్షాలు బీజేపీ వైఖరిని విమర్శిస్తున్నాయి. దీనిపై తాజాగా స్పందించిన ప్రధాని మోదీ.. ఎన్నికల బాండ్ల విధానంపై నిజాయతీగా ఆలోచిస్తే.. వాటి రద్దు గురించి ప్రతి ఒక్కరూ బాధపడతారని అన్నారు.

అత్యంత పారదర్శకమైన ఈ విధానం వల్ల రాజకీయ పార్టీల నగదు లావాదేవీలు స్పష్టమైన మార్గం ఏర్పడిందని అన్నారు. నల్ల ధనాన్ని అరికట్టేందుకు తన మనసుకు వచ్చిన స్వచ్ఛమైన ఆలోచనే ఎన్నికల బాండ్లు అని పేర్కొన్నారు.  అయితే ఎన్నికల బాండ్లపై పారదర్శకత ఉంటే సుప్రీం కోర్టు ఎందుకు కొట్టివేస్తుంది..  మొట్టి కాయలు వేస్తుంది అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇది క్విడ్ ప్రోకు దారి తీస్తోందని స్పష్టం చేసింది.

దిల్లీ లిక్కర్ స్కాంలో ప్రధాన నిందితుడిగా ఉన్నశరత్ చంద్రరెడ్డి రూ.55 కోట్లను బాండ్లను బీజేపీకి విరాళం ఇచ్చారు. వెంటనే ఆయనకు బెయిల్ వచ్చింది.  ఓ స్కాంలో నిందితుడిగా ఉన్న శరత్ చంద్రారెడ్డి నుంచి బీజేపీ రూ.55 కోట్లు ఎందుకు విరాళం సేకరించింది అనే దానికి సమాధానం ఉండదు. ఇలా ఎవరిపై..ఏ కంపెనీపై ఆరోపణలు చేస్తారో కేసులు నమోదు చేస్తారో వారంతా బాండ్లు కొనుగోలు చేసి.. బీజేపీకి ముడుపులు ముట్టజెప్పి ఆ కేసుల నుంచి బయట పడతారు అని విశ్లేషిస్తున్నారు. పారదర్శకంగా ఉండాలని సుప్రీం కోర్టు చెబితేనే లేదు వ్యక్తిగత గోప్యత అంటూ దాటేసే ప్రయత్నం చేశారు. ఇది ఏ విధంగా పారదర్శకత అవుతుందని పలువురు ప్రశ్నిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: