ఉత్తరాంధ్ర: అభ్యర్థుల మార్పులపై టీడీపీ తుది కసరత్తు?

Purushottham Vinay
ఆంధ్రప్రదేశ్ లో రేపటి నుంచి నామినేషన్లు స్టార్ట్ కానున్నాయి. మూడు పార్టీల కూటమిలో కొన్ని సీట్ల మార్పు పైన కసరత్తు జరుగుతోంది. అనపర్తి, ఉండి తంబళ్లెపల్లె ఇంకా అలాగే జమ్మలమడుగు స్థానాల పైన టీడీపీ, బీజేపీ మధ్య చర్చలనేవి జరుగుతున్నాయి.సర్వే నివేదిక ఆధారంగా అభ్యర్దుల మార్పు పైన చంద్రబాబు నాయుడు తుది కసరత్తు చేస్తున్నారు. అందులో భాగంగా అనకపాల్లి పార్లమెంట్ పరిధిలోని మాడుగుల స్థానంలో ఇప్పటికే ప్రటించిన అభ్యర్దిని మార్చాలని చంద్రబాబు నాయుడు నిర్ణయించారు.మాడుగుల నుంచి టీడీపీ అభ్యర్దిగా ఎన్నారై పైలా ప్రసాద్ ను చంద్రబాబు నాయుడు మొదట ప్రకటించారు. ఇప్పటికే ఆయన ప్రచారం కూడా చేసుకుంటున్నారు. అయితే, సీటు పైన ఆశలు పెట్టుకున్న మాజీ ఎమ్మెల్యే రామానాయుడు సీటు రాకపోవటంతో బాధ పడ్డారు. తెలుగుదేశం ప్రకటించిన ప్రసాద్ పైన సొంత పార్టీ నేతల నుంచే వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. దీంతో...అభ్యర్ది మార్పు పైన కొద్ది రోజుల నుంచి చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్ది సీఎం రమేష్ కూడా మాడుగులలో అభ్యర్దిని మార్చాలని చంద్రబాబు నాయుడును కోరారు.తాజాగా చంద్రబాబు నాయుడు విశాఖ పర్యటనలో మాజీ మంత్రి బండారు సత్యనారాయణ తో మాట్లాడటం జరిగింది. మాడుగుల నుంచి పోటీ చేయాలని ఆయన సూచించారు. పెందుర్తి సీటు జనసేన పార్టీకి వెళ్ళటంతో బండారు ప్రచారానికి దూరంగా ఉన్నారు.


తాను మాడుగుల నుంచి పోటీ చేయాలంటే తన కుమార్తెకు పెందుర్తి పార్టీ ఇంఛార్జ్ గా బాధ్యతలు కేటాయించాలని ఆయన కోరారు. దీంతో..రంగంలోకి దిగిన సీఎం రమేష్ నేరుగా బండారు ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు.ఆయన్ని మాడుగుల నుంచి పోటీ చేయాలని కోరారు. ఇక చివరగా బండారు అంగీకరించారు. దీంతో..మాడుగుల సీటును బండారు కేయించిన చంద్రబాబు నాయుడు పైలా ప్రసాద్ కు పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రాధాన్యత ఇస్తానని హామీ ఇచ్చారు.మాడుగుల ఎమ్మెల్యేగా ఉన్న వైసీపీ నేత బూడి ముత్యాల నాయుడు ఇప్పుడు అనకాపల్లి ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఇక ఆయన కుమార్తె అనురాధా మాడుగుల నుంచి ఎమ్మెల్యేగా పోటీలో ఉన్నారు. దీంతో, ఇప్పుడు బండారు సత్యానారాయణ అభ్యర్దిత్వం కన్ఫర్మ్ కావటంతో..ఆయన ప్రచారంలోకి దిగనున్నారు. తెలుగుదేశం నుంచి అనపర్తి, ఉండి సీట్ల విషయంలో కూడా ఈ రోజు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టత ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. అనపర్తి సీటు కనుక తిరిగి టీడీపీకి దక్కితే నల్లిమిల్లి పోటీలో కొనసాగనున్నారు. ఇక ఉండి సీటు అయితే రఘురామ రాజుకు దక్కటం ఖాయంగా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: